English | Telugu

చిరంజీవి వర్సెస్ పవన్ కళ్యాణ్.. అసలేం జరుగుతోంది..?

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకరంటే ఒకరు ప్రేమగా ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఈ అన్నదమ్ముల అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.

చిరంజీవి అప్ కమింగ్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పవన్ కళ్యాణ్ నుండి రానున్న నెక్స్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని 2026 వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: 'అఖండ 2' ఫస్ట్ డే కలెక్షన్స్.. అఖండకు రెట్టింపు..!

'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ 'దేఖ్ లేంగే సాలా' డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. సాంగ్ లాంచ్ ఈవెంట్ ని రేపు సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అదే టైంలో 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ టీమ్ భారీ ప్రెస్ మీట్ ని ప్లాన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

డిసెంబర్ 13 సాయంత్రం 5:30 కి గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు 'మన శంకర వరప్రసాద్ గారు' నిర్మాతలు తాజాగా ప్రకటించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మూవీ సాంగ్ లాంచ్ ఉండగా.. చిరంజీవి మూవీ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండటం ఏంటనేది అభిమానులకు అర్థం కావట్లేదు.

'ఉస్తాద్ భగత్ సింగ్' సాంగ్ లాంచ్ గురించి అవగాహన లేక 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారా? లేదా తెలిసే ఇలా చేస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది.