English | Telugu
హైకోర్టులో పవన్ కళ్యాణ్ పిటిషన్!
Updated : Dec 12, 2025
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. సినీ సెలబ్రిటీల AI వీడియోలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. వాటిలో పాజిటివ్ గా ఉండే వీడియోలు కొన్నయితే.. సెలబ్రిటీల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉండే నెగెటివ్ వీడియోలు ఎన్నో. అందుకే వీటిపై పలువురు సెలబ్రిటీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. (Pawan Kalyan)
ఇప్పటికే చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు కోర్టుని ఆశ్రయించారు. ఇప్పుడు ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ కూడా చేరారు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
పవన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొందరు AI వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయాన్ని పవన్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. AI వీడియోలను చూసిన న్యాయమూర్తి.. ఆ లింక్‌లను 48 గంటల్లోపు అందించాలని సూచించారు.
అలాగే, వాటిపై వారంలోపు చర్యలు తీసుకోవాలని గూగుల్, మెటా తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను డిసెంబరు 22కు వాయిదా వేశారు.