English | Telugu
Akhanda 2: ప్రీమియర్స్ కి హైకోర్ట్ షాక్.. బెనిఫిట్ షో ఉందా లేదా!
Updated : Dec 11, 2025
-అఖండ 2 కి షాక్
-వాట్ నెక్స్ట్
మరికొన్నిగంటల్లో సిల్వర్ స్క్రీన్ పై ప్రదర్శితమయ్యే 'అఖండ 2'(Akhanda 2)ప్రీమియర్స్ కోసం అభిమానులు రెడీ అయ్యారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ కి సంబంధించిన టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి. ప్రెజెంట్ తెలంగాణ హైకోర్టు అఖండ 2 కి షాక్ ఇచ్చింది.
అఖండ 2 కి ప్రభుత్వం ఇచ్చిన ప్రీమియర్ షో టికెట్ల పెంపు జీవోని సస్పెండ్ చేయడంతో పాటు ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో పాటు నిర్మాణ సంస్థకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేస్తున్నామని స్పష్టం చేసింది.మరోవైపు ప్రీమియర్స్ కి ఇప్పటికే అభిమానులు 600 రూపాయలు పెట్టి టికెట్లు కొనుగోలు చేశారు.ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రీమియర్స్ ఉంటాయా లేదా అనే టెన్షన్ అభిమానుల్లో ఉంది.
also read: ఓవర్ సీస్ ప్రీ సేల్స్ లో అఖండ 2 రికార్డు ఇదే