English | Telugu
రామ్ చరణ్‌తో కలిసి బర్త్‌డే జరుపుకున్న హీరోయిన్
Updated : Jun 19, 2014
జూన్ 19 న కాజల్ పుట్టినరోజు. ఒకరోజు ముందే కాజల్ పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి. టాలీవుడ్ యువరాణి కాజల్ పుట్టినరోజుని, మగధీరుడు రామ్ చరణ్ దగ్గరుండి సెలబ్రేట్ చేశాడు. ఈ సెలబ్రేషన్స్ లో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా పాల్గోంది. పుట్టినరోజుకి ఒక రోజు ముందే జరిగిన ఈ ముచ్చటైన సెలబ్రేషన్ లో వీరు ఇలా సెల్ఫీలు తీయించుకున్నారు. రామ్ చరణ్, కాజల్ కలిసి ఇప్పుడు గోవిందుడు అందరివాడాలే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో విషయం ఈ సెల్ఫీలో మరో హీరోయిన్, కాజల్ ఫ్రెండ్ కమిలినీ ముఖర్జీ కూడా వున్నారు..