English | Telugu

సుమన్ శెట్టిని తక్కువంచనా వేస్తున్నారు.. ఆయన ఫ్లాష్ బ్యాక్ తెలుసా?

తెలుగు తెర చూసిన గొప్ప కమెడియన్స్ లో సుమన్ శెట్టి (Suman Setty) ఒకరు. అమాయకత్వంతో కూడిన హాస్యాన్ని పండించడంలో ఆయన దిట్ట. 15 ఏళ్ళ పాటు పదుల సంఖ్యలో సినిమాలు చేసి, ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. కొన్నేళ్లుగా సినిమాల్లో పెద్దగా కనిపించని సుమన్ శెట్టి.. ఇప్పుడు బిగ్ బాస్-9 లో ప్రత్యక్షమై అందరినీ సర్ ప్రైజ్ చేశారు. (Bigg Boss 9)

బిగ్ బాస్ అంటేనే వివాదాలకు, గొడవలకు పెట్టింది పేరు. అలాంటి బిగ్ బాస్ షోలో సుమన్ శెట్టి లాంటి ఇన్నోసెంట్ పర్సన్ రాణించగలడా? అనే అనుమానాలు మొదట వ్యక్తమయ్యాయి. అయితే సుమన్.. ఓ వైపు అవసరమైన సమయంలో ధీటైన సమాధానాలు చెబుతూనే, మరోవైపు తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటున్నారు. దీంతో సుమన్ శెట్టికి రోజురోజుకి మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా అప్పట్లో సినిమాలు చూసి సుమన్ ని అభిమానించిన వారు.. ఇప్పుడు బిగ్ బాస్ షో చూసే అలవాటు లేకపోయినా.. ఆయనకు ఓట్లు వేస్తున్నారంటే.. ఏ రేంజ్ సపోర్ట్ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ జనరేషన్ కి సుమన్ శెట్టి గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఒక్కసారి ఆయన జర్నీ గురించి తెలిస్తే మాత్రం.. వావ్ అనకుండా ఉండలేరు.

సుమన్ శెట్టి స్వస్థలం విశాఖపట్నం. 1983 జూన్ 9న జన్మించారు. సినీ రచయిత సత్యానంద్ ఆయనలోని నటుడిని గుర్తించి, సినిమాలలో ప్రయత్నించమని ప్రోత్సహించారు. అలా తేజ దర్శకత్వంలో 2002లో వచ్చిన 'జయం' సినిమాతో టాలీవుడ్ కి కమెడియన్ గా పరిచయమయ్యారు సుమన్ శెట్టి. ఆ సినిమాలో 'అలీ బాబా'గా ఆయన పంచిన వినోదాన్ని అంత తేలికగా మరచిపోలేము. మొదటి సినిమాకే బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డు అందుకున్నారో.. ఏ రేంజ్ లో నవ్వుల వర్షం కురిపించారో అర్థం చేసుకోవచ్చు.

'జయం' తర్వాత సుమన్ శెట్టి వెనుతిరిగి చూసుకోలేదు. స్టార్ కమెడియన్ గా దశాబ్దంపాటు ఆయన కెరీర్ దిగ్విజయంగా కొనసాగింది. కబడ్డీ కబడ్డీ, 7జి బృందావన్ కాలనీ, యజ్ఞం, ధైర్యం, రణం, ఉల్లాసంగా ఉత్సాహంగా, దొంగల బండి, బెండు అప్పారావు.. ఇలా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో కట్టిపడేశారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అక్కడ దాదాపు 20 సినిమాల్లో నటించి మెప్పించారు.

2002 నుంచి 2012 మధ్య కాలంలో టాలీవుడ్ మోస్ట్ బిజీ ఆర్టిస్ట్ లలో సుమన్ శెట్టి ఒకరు. ఆ సమయంలో కొందరు యంగ్ హీరోల కంటే.. ఈ కమెడియన్ ఎక్కువ పేరు, డబ్బు సంపాదించారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం సుమన్ శెట్టికి ఉన్న గొప్ప లక్షణాలలో ఒకటి. తన తొలి చిత్ర దర్శకుడు తేజను గాడ్ ఫాదర్ గా భావిస్తారు. ఆయన సూచనతో అప్పట్లో హైదరాబాద్ లోని మణికొండలో మంచి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇంటి విలువ ఎన్నో రెట్లు పెరిగింది. ఇంకో విశేషం ఏంటంటే.. తన ఇంటిలో డైరెక్టర్ తేజ పేరు మీద ప్రత్యేకంగా ఒక రూమ్ ని కేటాయించారు. ఆ రూమ్ లో తేజ ఫోటో ఉంటుంది. దీన్ని బట్టే సుమన్ శెట్టి మనస్తత్వం ఎంత గొప్పదో అర్థమవుతోంది.

కొన్నేళ్లుగా సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్న సుమన్.. తన కుటుంబంతో కలిసి వైజాగ్ లో నివసిస్తున్నారు. ఎంత పేరు, డబ్బు ఉన్నా.. ఆయన హంగు ఆర్భాటాలకు దూరంగానే ఉంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు. తన నిజాయితీ, కామెడీ టైమింగ్ తో అందరి మనసులు దోచుకుంటున్నారు. అందుకే ఆయన విన్నర్ కావాలని కోరుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.