English | Telugu

వంద కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న చిత్రం బ్యూటీ!

ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ‘బ్యూటీ’ నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..

ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు కదా?
సినిమా ఇండస్ట్రీలో ఒకటి లేదా రెండు శాతమే సక్సెస్ ఉంటుంది. ఒక మూవీ తీసి హిట్టు కొట్టేస్తా అని అంటే కుదరదు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా నిర్మిస్తూనే ఉండాలనే ఉద్దేశం, లక్ష్యంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. మంచి కథలు, అన్ని రకాల జానర్లలో డిఫరెంట్ సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నాను. అందుకే ‘బార్బరిక్’, ‘బ్యూటీ’ చిత్రాలను నిర్మించాను. నెక్ట్స్ హారర్, కామెడీ ప్రధాన చిత్రాలను నిర్మించాలని అనుకుంటున్నాను.

‘బ్యూటీ’ జర్నీ ఎలా సాగింది?
ఇప్పటి వరకు ‘బ్యూటీ’ జర్నీ ఎంతో బాగా సాగింది. టైటిల్ ఎంతో క్యాచీగా ఉండటంతో.. జనాల్లోకి ఎక్కువగా వెళ్లింది. పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకు చూసిన వారంతా కూడా మూవీని మెచ్చుకున్నారు. రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.

‘బ్యూటీ’లో మీకు నచ్చిన అంశమేంటి?
‘బ్యూటీ’ కథలో అందమైన ప్రేమ కథతో పాటుగా మనసుని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి. ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన చిత్రంగా మా ‘బ్యూటీ’ నిలుస్తుంది. పిల్లలు, తల్లిదండ్రులు ఇలా అందరూ కలిసి చూడదగ్గ చిత్రం. నాకు పర్సనల్‌గా ఎమోషనల్ సీన్స్ అంటే ఇష్టం. ఈ కథలోని ఎమోషన్స్ నచ్చే నిర్మించేందుకు ముందుకు వచ్చాను.

మారుతి గారు, జీ స్టూడియో సహకారం ఎలా ఉంది?
‘బ్యూటీ’ కథను విన్న వెంటనే ఈ మూవీని చేద్దామని మారుతి గారికి చెప్పాను. జీ స్టూడియో సహకారం వల్లే మా సినిమాను ప్రతీ ఒక్కరికీ రీచ్ చేయగలిగాం. రిలీజ్ విషయంలో వారి సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. మా మూవీని దాదాపు 150 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. మౌత్ టాక్‌తో తరువాత మళ్లీ థియేటర్లను పెంచుతాం.

‘బ్యూటీ’ విషయంలో బడ్జెట్ ఎందుకు పెరిగింది?
‘బ్యూటీ’ని ప్రారంభంలో వేరే హీరోయిన్‌తో షూటింగ్ చేశాం. ఓ వారం రోజులు అలా షూటింగ్ చేశాం. ముందుగా రైటర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. హీరోయిన్‌ పక్కింటి అమ్మాయిలా ఉండాలి అనుకున్నాం. ఆ హిరోయిన్ పాత్రకు అంతగా సెట్ అవ్వడం లేదు అని అంతా అనుకున్నాం. ఆ తరువాత నీలఖి ఈ సినిమాలోకి వచ్చారు. అలా సినిమా ఆరంభంలో చేసిన షూటింగ్ అంతా వృథా అయింది. దాని వల్ల బడ్జెట్ కాస్త పెరిగింది.

‘బ్యూటీ’కి ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?
‘బ్యూటీ’ మూవీని ఇప్పటి వరకు చాలా మంది చూశారు. కొందరైతే ‘బేబీ’, ‘కోర్ట్’ స్టైల్లో ఉందని మెచ్చుకున్నారు. ఇంకొందరు అయితే వంద కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న చిత్రమిదని ప్రశంసించారు. అన్ని వర్గాల ఆడియెన్స్‌ను మెప్పిస్తుందని పొగిడారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం