English | Telugu
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!
Updated : Oct 18, 2023
మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు కుందర జానీ కన్నుమూశారు. 72 ఏళ్ళ జానీ మంగళవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రాత్రి సమయంలో ఆయనకు ఛాతి నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్ళగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం.
కుందర జానీ 1951, జనవరి 1న కేరళలోని కొల్లాంలో జన్మించారు. 1979 విడుదలైన 'నిత్య వసంతం' అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాలోనే వయసుకి మించిన పాత్రలో నటించి మెప్పించిన ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. మలయాళంలో వందకి పైగా సినిమాల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. తెలుగులో 'రౌడీయిజం నశించాలి' అనే సినిమాలో ఆయన నటించారు.