English | Telugu

రేణు దేశాయ్‌కి మళ్లీ పెళ్లి.. అడ్డు పడుతున్న పవన్‌కళ్యాణ్‌ పిల్లలు!

‘బద్రి’ షూటింగ్‌ సమయంలో పవన్‌కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ల మధ్య ప్రేమ చిగురించడం, దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత 2009లో పెళ్ళి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మూడేళ్ళకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి రెండో పెళ్ళి చేసుకోకుండా ఇద్దరు పిల్లలతో ఉంటోంది రేణు. ఆమధ్య తను మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. తన ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలను కూడా షేర్‌ చేసింది. రేణుదేశాయ్‌ మళ్ళీ పెళ్లి చేసుకోబోతోందనే వార్త అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకురాలేదు. తన రెండో పెళ్ళి ఆగిపోవడానికి కారణాలు ఏమిటి అనేది తర్వాత వివరించింది.

‘నాకు తగిన వ్యక్తి అనిపించిన వ్యక్తిని పెద్దల అంగీకారంతోనే పెళ్ళి చేసుకోవాలని డిసైడ్‌ అయ్యాను. ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. ఆ తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ చెప్పిందేమిటంటే...పిల్లలకి తోడుగా నువ్వు ఉండాలి. నువ్వు ఎలా ఉండగలవు అన్నారు. ఎంగేజ్‌మెంట్‌ ఫోటోస్‌ కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత నేను చేసిన తప్పు తెలిసి వచ్చింది. నేను పెళ్ళి చేసుకుంటే అతనికి కొంత సమయం కేటాయించాలి.అప్పటికి నా కూతురు వయసు ఏడేళ్లు. నా కూతురు కోసం ఆలోచించాను. ఇప్పటికే తండ్రి లేడు. నేను కూడా వేరే వ్యక్తితో ఉంటే ఆ పిల్లల పరిస్థితి ఊహించలేం. అందుకే పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకున్నాను. ఇప్పుడు తన వయసు 13 ఏళ్లు. నాకు పెళ్ళి అంటే మంచి అభిప్రాయం ఉంది. నాకూ పెళ్లి చేసుకోవాలనే ఉంది.

ఆధ్య కాలేజ్‌కి వెళ్ళే టైమ్‌కి నా పెళ్ళి గురించి ఆలోచిస్తాను. నేను పెళ్లి చేసుకోవడం నా పిల్లలకు కూడా ఇష్టమే. ఒక వ్యక్తి వల్ల నువ్వు సుఖంగా, సంతోషంగా ఉంటావు అనుకుంటే హ్యాపీగా పెళ్లి చేసుకో మమ్మీ అని నా కొడుకు అకిరా నందన్‌ చాలా సార్లు అన్నాడు. అయితే నా ఇద్దరు పిల్లలకు టైమ్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే నా పెళ్ళి ఆలోచనని కొన్నాళ్ళు పోస్ట్‌పోన్‌ చేసుకున్నాను. మరో రెండు సంవత్సరాల్లో పిల్లలు పెద్దవారవుతారు. పెళ్ళి గురించి ఆలోచించడానికి అదే కరెక్ట్‌ టైమ్‌ అని నాకనిపిస్తోంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.