English | Telugu

సచిన్ ప్రేమ మొదలైంది

హిందీలో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన "ఆషికీ 2" చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరోగా "మౌనమేలనోయి" ఫేం సచిన్ జోషి నటించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్త కార్యక్రమాలు నేడు హైదరాబాదులో జరిగాయి. ఈ చిత్రంలో సచిన్ సరసన నటించే హీరోయిన్ కోసం చాలా వెతికారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నజియా అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారు. మరి ఈ అమ్మడు ఎంతవరకు జనాలకు పిచ్చేక్కిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి రవీంద్ర దర్శకత్వం వహించనున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.