English | Telugu

ఫైట్ అయ్యింది.. ఇక పాటేసుకోవాలి !

రవితేజ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "పవర్". హన్సిక, రెజీనా హీరోయిన్లు. ఇటీవలే చెన్నై హార్బర్ లో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో పది రోజులపాటు ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈనెల 6 నుండి కోల్ కతాలో పది రోజులు షెడ్యులు జరగనుంది. ఇందులో రవితేజ, రెజీనాలపై ఒక పాట, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాదు, బ్యాంకాక్ లలో షూటింగ్ చేయనున్నారు. పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాక్ లైన్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్లో రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రవితేజ పవర్ ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.