English | Telugu

మహేష్ ఆగడు రివ్యూ: ఫ్యాన్స్ కి పండగే

Aagadu movie Story:

పోలీస్ అధికారి రాజా నరసింగరావు (రాజేంద్ర ప్రసాద్) అనాథ కుర్రాడు అయిన శంకర్ ( మహేష్ బాబు)ని చేరదీసి పోలీస్ ఆఫీసర్ ని చేయాలని అనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితులలో శంకర్ ఒక కుర్రాడిని చంపేయడంతో రాజా నరసింగరావు అతన్ని బోస్టన్ స్కూల్ కి పంపించేస్తాడు. శంకర్ అక్కడే బాగా చదువుకొని పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఆ టైంలో బుక్క పట్టణంలో దామోదర్ (సోనూసూద్) చేస్తున్న అక్రమాలను అడ్డుకోవటానికి శంకర్ ని బుక్క పట్టణం సిఐగా పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన శంకర్ తన దైన శైలిలో చెలరేగిపోతాడు. ఈ సమయంలో దామోదర్ గురించి శంకర్ కి ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి.? దామోదర్ చేసే అక్రమాలను శంకర్ ఏ విధంగా అడ్డుకుంటాడు? దాని కోసం ఎలాంటి ఎత్తులు వేస్తాడు? అలాగే శంకర్ చిన్నప్పుడు చేసిన హత్య వెనకున్న నిజాలేమిటి? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Performances:

'ఆగడు' సినిమా మెయిన్ హైలైట్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో కావడం. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి శుభం కార్డ్ పడే వరకు మహేష్ సరికొత్త యాటిట్యూడ్, మానరిజమ్స్, పంచ్ డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా మూడు పాటలకి మంచి స్టెప్స్ వేసి అభిమానులలో మరింత ఊపు తెప్పించాడు.

మహేష్ సరసన మొదటిసారి నటిస్తున్న తమన్నా ఉన్నంత సేపూ ఆడియన్స్ తనవైపు తిప్పుకుంది. ఈ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. పాటలలో గ్లామరస్ గా కనిపించి ఆడియన్స్ ని మైమరపించింది. సెకాండాఫ్ లో వచ్చే శృతి హాసన్ సాంగ్ ఐటెం సాంగ్ కూడా బాగానే వుంది.
  
మహేష్ ప్రతి సినిమాలో కనిపించే నాజర్ ఈ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ గా నవ్వులు పూయించాడు. సెకండాఫ్ లో బ్రహ్మానందం చేసే డాన్స్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తోంది.  రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్ధి తమ పాత్రలకు న్యాయ౦ చేశారు. 
సోనూసూద్ నెగిటివ్ క్యారెక్టర్ బాగా ఎలివేట్ చెయ్యకపోవటంతో సాదాసీదా విలన్ గా కనిపిస్తాడు.

ఈ కథ కొత్తదీ కాదు అలాగని కథనమూ అద్బుతంగా లేదు. చాలా రొటీన్ కథకు, చాలా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అందించారు శ్రీను వైట్ల. అయితే అది మహేష్ సినిమా కావటం, కామెడీ పండటం తో ఆ సమస్య హైలెట్ కాలేదు. అలాగే ఫస్టాఫ్ మీద పెట్టిన దృష్టి సెకండాఫ్ మీద అసలు పెట్టలేదనిపిస్తుంది. ఒక్కసారి ట్విస్ట్ లు రివిల్ అయ్యాక చాలా సాదాసీదా సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.

Technicalities:

మహేష్ బాబు 'దూకుడు' 'బిజినెస్ మ్యాన్' సినిమాలకు మంచి సంగీతాన్ని అందించిన థమన్ ఈ సినిమాకి అదే రెంజులో మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా టైటిల్ సాంగ్, సరోజా, నారీ నారీ సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా చూపించారు. ముఖ్యంగా పాటలలో వచ్చే ప్రతి లొకేషన్ ని చాలా అందంగా చూపించారు. శ్రీనువైట్ల ఎడిటింగ్ పై కొంచెం శ్రద్ద వహించాల్సి౦ది. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా బాగా స్పీడ్ గా అనిపించినా, సెకండాఫ్ లో మాత్రం స్లో అయ్యింది.  14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వారి నిర్మాణ విలువలు  బాగా రిచ్ గా ఉన్నాయి.   

Bottom Line:


ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఆగడు' లో మహేష్ తన సరికొత్త యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నప్పటికీ రొటీన్ కథ, కథనాలు ప్రేక్షకులకుబోర్ కొట్టిస్తాయి. శ్రీనువైట్ల మార్క్ కామెడీ, బ్రాహ్మీ డాన్స్ ఎపిసోడ్ సినిమాని కాపాడతాయేమో చూడాలి.  ప్రస్తుతం రెండు వారాల వరకు పెద్ద హీరోల సినిమా ఏవి లేకపోవడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఏ స్థాయిలో నిలబడుతుందో  వేచి చూడాల్సిందే!