English | Telugu

‘ఆగడు’ వంద కోట్లు కలెక్ట్‌ చేస్తుంది: సూపర్‌స్టార్‌ కృష్ణ

సూపర్‌స్టార్‌ మహేష్‌, తమన్నా జంటగా జి.రమేష్‌బాబు సమర్పణలో సూపర్‌ డైరెక్టర్‌ శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆగడు’. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 19న విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ సాధించి యునానిమస్‌గా సూపర్‌హిట్‌ టాక్‌తో దిగ్విజయంగా రన్‌ అవుతోంది. సూపర్‌స్టార్‌ కృష్ణ, విజయనిర్మల దంపతులు ఈ చిత్రాన్ని శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని సినీమాక్స్‌ థియేటర్‌లో ప్రత్యేకంగా వీక్షించారు.

అనంతరం మీడియాతో సూపర్‌స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ ` ‘‘ఆగడు’ సినిమా అదిరింది. సినిమా చూస్తున్నంత సేపు చాలా చాలా బాగుంది. మహేష్‌ ఎక్స్‌ట్రార్డినరీగా నటించాడు. శ్రీను వైట్ల అద్భుతంగా డైరెక్ట్‌ చేశాడు. థమన్‌ మ్యూజిక్‌, ఫోటోగ్రఫీ, ఫైట్స్‌, కామెడీ, ఎస్పషల్లీ డైలాగ్స్‌ అన్నీ ఎక్స్‌లెంట్‌గా వున్నాయి. ఇందులో ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు. 14 రీల్స్‌ నిర్మాతలు రామ్‌, గోపీ, అనీల్‌ చాలా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని బ్యూటిఫుల్‌గా నిర్మించారు. ‘ఆగడు’ అన్ని రికార్డ్స్‌ని క్రాస్‌ చేసి ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లు కలెక్ట్‌ చేస్తుందని నా నమ్మకం. మంచి సబ్జెక్ట్‌ కుదిరితే నేను, మహేష్‌ కలిసి నటిస్తాం’’ అని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ ` ‘‘ఆగడు టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా కూడా వండర్‌ఫుల్‌గా వుంది. ఒక్క సెకను కూడా బోర్‌ కొట్టకుండా సినిమా ఇంత త్వరగా అయిపోయిందా అనిపించింది. మహేష్‌ పుట్టుకతోనే మంచి ఆర్టిస్ట్‌. తనలో మంచి టాలెంట్‌ వుంది. ఈ చిత్రంలో చాలా అద్భుతంగా నటించాడు. సైలెంట్‌గా వుంటూనే అందర్నీ నవ్విస్తాడు. ‘ఆగడు’ చాలా చాలా బాగుంది. అందరికీ నచ్చే సినిమా ఇది’’ అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, తమన్నా, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, నాజర్‌, తనికెళ్ల భరణి, సోనుసూద్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.వి.గుహన్‌, సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపి ఆచంట, అనీల్‌ సుంకర, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: శ్రీను వైట్ల.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.