English | Telugu
సెట్స్ మీద నయనతార 75!
Updated : Apr 10, 2023
నయనతార 75 సినిమా ఆన్‌సెట్స్ మీదుంది. అంగరంగవైభవంగా సినిమాను ప్రారంభించారు మేకర్స్. క్లాప్ బోర్డ్ మీద శుభాకాంక్షలు రాసి సంతకం చేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. నిలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. తాత్కాలికంగా నయన్ 75 అని టైటిల్ పెట్టారు. మహిళా ప్రాధాన్యం ఉన్న మూవీ. పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలుపెట్టారు. పూజ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్. ఘనంగా జరిగిన పూజా విజువల్స్ తో పాటు రజనీకాంత్ క్లాప్‌బోర్డు మీద రాసిన విజువల్స్ కూడా ఫ్యాన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. నిలేష్ కృష్ణకి డైరక్టర్‌గా ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్. ఇంతకు ముందు శంకర్ దగ్గర 2.0 సినిమాకు పనిచేశారు.
నయనతార 75లో జై, సత్యరాజ్, కె.యస్.రవికుమార్, అచ్యుత్‌కుమార్, కుమారి సచ్చు, కార్తిక్ కుమార్, రేణుక, సురేష్ చక్రవర్తి, పూర్ణిమ రవి కీ రోల్స్ చేస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత జై, నయనతార ఈ సినిమాతో మళ్లీ జతకడుతున్నారు. ఇంతకు పూర్వం వీరిద్దరూ ప్రేమికులుగా రాజా రాణి సినిమా విడుదలైంది. నయనతారతో మళ్లీ పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు జై. తమన్ సంగీతం అందిస్తున్న సినిమా ఇది. సత్యన్ సూర్యన్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రవీణ్ యాంటోనీ ఎడిటింగ్ చేస్తున్నారు. జీ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్, నాద్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న చిత్రమిది.
నయనతార కమర్షియల్ హీరోయిన్‌గా ఎంత సక్సెస్ అయ్యారో, బెస్ట్ ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్టులతోనూ అంతగానే మెప్పించారు. ఆ స్టామినా ఆమెకు లేడీ సూపర్‌స్టార్ క్రెడిట్ తెచ్చిపెట్టింది. తన 75వ సినిమాలో లేడీ ఓరియంటెడ్ కేరక్టర్ చేస్తున్న నయన్, ఇప్పుడు జవాన్‌లో షారుఖ్ పక్కన జవాన్‌లో పక్కా కమర్షియల్ రోల్ చేస్తున్నారు. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడలో విడుదల కానుంది జవాన్. విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగిబాబు, సునీల్ గ్రోవర్ కీ రోల్స్ చేస్తున్నారు. డైరక్టర్ అట్లీతో ఇంతకు ముందు పనిచేసిన ఎక్స్ పీరియన్స్ ఉంది నయన్‌కి.