English | Telugu
నాలుగు వారాలకే ఓటీటీలోకి 'దసరా'!
Updated : Apr 20, 2023
కొన్ని హిట్ సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీలో విడుదలై సర్ ప్రైజ్ చేస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'దసరా' కూడా నాలుగు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్స్ లో విడుదలైన రెండు నెలలకు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని మొదట ప్రచారం జరిగింది. కానీ నెల రోజులు కూడా తిరక్కుండానే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది.
నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన సినిమా 'దసరా'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న విడుదలైంది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా రూ.63 కోట్లకు పైగా షేర్ రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. థియేటర్లలో విశేష ఆదరణ పొందిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 27 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని తాజాగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. అంటే థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోందన్నమాట. హిందీ వెర్షన్ పై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.