English | Telugu

సెన్సార్ బోర్డుకి రూ.6.5 లక్షలు లంచమిచ్చా.. మోడీకి ఫిర్యాదు చేసిన విశాల్!

తమిళ, తెలుగు భాషల్లో సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరో విశాల్. తాజాగా ఆయన మార్క్ ఆంటోనీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు,తమిళ భాషల్లో సెప్టెంబర్ 15న విడుదలైన ఈ సినిమా నిన్న(సెప్టెంబర్ 28) నార్త్ లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా తన సినిమాకి జరిగిన ఒక అన్యాయం గురించి విశాల్ చెప్పిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి.

విశాల్ డ్యూయెల్ రోల్ పోషిస్తూ ప్రముఖ దర్శకుడు ఎస్ జె .సూర్య ప్రధాన పాత్రలో టైం మిషన్ నేపథ్యంలో వచ్చిన మార్క్ ఆంటోనీ సినిమా అర్ధం కానీ స్క్రీన్ ప్లే వలన హిట్ టాక్ తెచ్చుకోలేదు. సినిమా కథ మంచిదే అయినా దర్శకుడి వైఫల్యం వల్ల సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా చేసింది. ఇంక అసలు విషయానికి వస్తే.. మార్క్ ఆంటోనీ నిన్న హిందీ వెర్షన్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఏ భాషలో సినిమా రిలీజ్ అవుతుంటే ఆ భాషకి సంబంధించిన ఫిలిం బోర్డు ఆ సినిమా కి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తుంది. ఆ విధంగానే మార్క్ ఆంటోనీ కి హిందీ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వాలి. అందుకు సంబంధించిన పర్మిషన్ కోసం విశాల్ అప్లై చేసాడు.ఇక్కడే విశాల్ కి మైండ్ బ్లాంక్ అయినంత పని జరిగింది.

మార్క్ ఆంటోనీ సినిమా కి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని బోర్డు సభ్యులు విశాల్ ని అడిగారు. దీంతో సినిమా ఆగకూడదని విశాల్ అక్షరాలా 6 .5 లక్షల రూపాయలిని సెన్సార్ ఆఫీసర్లకు ఇచ్చి తన సినిమా రిలీజ్ చేయించుకున్నాడు. ఆ తర్వాత జరిగిన విషయాన్నంతా విశాల్ సామజిక మాధ్యమం ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకురావడమే కాకుండా సెన్సార్ బోర్డులో అవినీతి ఉండటం నన్ను చాలా బాధించిందని చెప్పడమే కాకకుండా ఇంకో సంచలనాన్ని కూడా విశాల్ సృష్టించాడు. ముంబై సెన్సార్ బోర్డులో ఎవరెవరికి ఎంతెంత లంచం ఇచ్చాడో వాళ్ళ బ్యాంకు నంబర్ల తో సహా విశాల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అలాగే మహారాష్ట్ర ముఖ్యమంతి ఏక్ నాద్ షిండే కి సంబంధించిన సోషల్ మీడియాలో ఆ వివరాలన్నీ పోస్ట్ చేసాడు. దీంతో ఈ విషయం ఎక్కడ దాకా వెళ్తుందో అని
అందరు అనుకుంటున్నారు.