English | Telugu

ప్ర‌భుదేవా కోసం మ‌క్క‌ల్ సెల్వ‌న్ కొత్త అవ‌తారం

ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్రభుదేవా లేటెస్ట్ మూవీ ‘వూల్ఫ్’. వినూ వెంకటేష్ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల‌తో పాటు క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ రిలీజ్ కానుంది. రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ టీజ‌ర్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కాగా.. ఇందులో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి కూడా భాగం అవుతున్నారు. అంటే ఈ విల‌క్ష‌ణ న‌టుడు యాక్ట‌ర్‌గా ఎలాంటి పాత్ర‌ల్లో మెప్పించారో మ‌న అంద‌రికీ తెలిసిందే. అలాంటి న‌టుడు ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ క్రియేట్ కావ‌చ్చు. కానీ అస‌లు విష‌యం ఏంటంటే..వూల్ఫ్ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి భాగం అవుతున్న‌ది నిజ‌మే. అయితే యాక్ట‌ర్‌గా మాత్రం కాదు.. టెక్నీషియ‌న్‌గా.

ఇంత‌కీ వూల్ఫ్ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి ఎలాంటి భూమిక‌ను పోషించ‌బోతున్నారంటే సింగ‌ర్‌గా. అమ్రిష్ సంగీత సారథ్యంలో విజ‌య్ సేతుప‌తి ఎలాంటి పాట‌ను పాడ‌బోతున్నారో మ‌రి తెలియాలంటే వెయిటింగ్ తప్పదు. ఈ సినిమా పీరియాడిక్ ట‌చ్‌తో సాగే ఫిక్ష‌న‌ల్ మూవీ. ఇందులో ప్ర‌భుదేవాతో పాటు అన‌సూయ భ‌ర‌ద్వాజ్, రాయ్ ల‌క్ష్మి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 600 ఏళ్ల క్రితం గోదావ‌రి ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రిగే క‌థాంశంతో వూల్ఫ్ సినిమా తెర‌కెక్కుతోంది. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌యం ఏంటంటే ఇది ప్ర‌భుదేవా న‌టిస్తోన్న 60వ సినిమా.

ఓ వైపు టాప్ కొరియోగ్రాఫ‌ర్‌గా రాణిస్తూనే నటుడిగా, ద‌ర్శ‌కుడిగానూ ప్ర‌భుదేవా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంటున్నారు మ‌రి. సందేశ్ నాగరాజు, సందేశ్.ఎన్ నిర్మాత‌లుగా బృందా జయరామ్ సహ నిర్మాతగా వూల్ఫ్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా టీజర్ చూస్తుంటే హారర్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాదిలోనే వూల్ఫ్ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయని సినీ సర్కిల్స్ టాక్.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.