English | Telugu

తనతో పాటే నేనూ చనిపోయాను.. కూతురు మరణంపై విజయ్ ఎమోషనల్ నోట్!

హీరో విజయ్ ఆంటోని కూతురు మీరా(16) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె మరణంతో విజయ్ ఎంతో కృంగిపోయాడు. ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాడు. తన కూతురితో పాటే తానూ చనిపోయానంటూ తాజాగా తన కూతురి మరణం గురించి విజయ్ రాసిన నోట్ కంటతడి పెట్టిస్తోంది.

"నా కూతురు ఎంతో దయగలది మరియు ధైర్యవంతురాలు. ఇప్పుడు తను ఈ ప్రపంచం కంటే ఉత్తమమైన.. కులం, మతం, బాధ, అసూయ, ద్వేషం లేని ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళిపోయింది. నేను తనతో పాటే చనిపోయాను. ఇప్పుడు నేను తనకోసం సమయం వెచ్చిస్తాను. తను చేయాలనుకున్న మంచి పనులను తన పేరుతో నేను పూర్తి చేస్తాను" అంటూ విజయ్ తన కుమార్తె గురించి ఎమోషనల్ గా రాసుకొచ్చారు. ఆయన రాసిన ఎమోషనల్ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఆయనకు ధైర్యం చెబుతున్నారు.