English | Telugu
పవన్ కళ్యాణ్ పై సోషల్ సెటైర్ వేస్తున్న నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ డైరెక్టర్
Updated : Dec 7, 2023
రైటర్ అండ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న నయా మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో వంశీ రకరకాల ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సినిమా గురించి వంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశీ మాట్లాడుతు పవన్ కళ్యాణ్ ,సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కబోయే నూతన చిత్రం సోషల్ సెటైరికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కనుందని ఆ చిత్రం తప్పకుండా పవన్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే విధంగా ఉంటుందని చెప్పాడు. స్క్రిప్ట్ కూడా సిద్ధం అవుతోందని ఒక రైటర్ గా ఆ సినిమా నాకు మంచి పేరు తీసుకొస్తుందని కూడా చెప్పాడు. ఇప్పుడు వంశీ చెప్పిన ఈ వ్యాఖ్యలతో పవన్ అభిమానుల్లో జోష్ వచ్చింది. పవన్, సురేందర్ రెడ్డి కాంబో సరికొత్త రికార్డ్స్ కూడా సృష్టించడం ఖాయమని కూడా ఫ్యాన్స్ అంటున్నారు.
అలాగే రేపు రాబోయే తన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ గురించి కూడా వంశీ మాట్లాడాడు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్బాగా రావడం కోసం నాతో పాటు నా టీం మొత్తం ఎంతో కష్టపడింది. మా అందరి కష్టానికి తగ్గట్టు సినిమాకి ప్రేక్షకులు ఘన విజయాన్ని అందిస్తారనే నమ్మకం కూడా ఉందని ఆయన అన్నాడు. శ్రేష్ట్ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ మూవీకి హారిస్ జయరాజ్ సంగీతాన్ని అందించాడు.నితిన్ సరసన శ్రీలీల కధానాయికిగా నటిస్తుంది.