English | Telugu

త్వరలో వరుడు కాబోతున్న సల్మాన్

బాలీవుడ్ లో పెళ్లి కాకుండా మిగిలిపోయిన ఏకైక నటుడు సల్మాన్ ఖాన్. ఇతని పెళ్లి గురించి బాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తుంది. గతంలో చాలా మంది హీరోయిన్ల రొమాన్స్ చేసి, ప్రేమాయణం నడిపి, తర్వాత వారికి దూరం అయ్యాడు. అయితే ఎప్పుడు పెళ్లి మాట మాట్లాడినా కూడా తప్పించుకునేవాడు. అయితే సల్మాన్ గతకొంత కాలంగా రొమేనియాకి చెందిన లులియాతో ప్రేమాయణం నడిపిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే సల్మాన్ ప్రస్తుతం పెళ్ళికి సిద్ధమయినట్లుగా అనిపిస్తుంది.

ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ మాట్లాడుతూ.. "పదిహేనేళ్ళ వయసు నుంచి నా జీవితంలో జరగని మార్పులు ఇప్పుడిప్పుడే మారుతున్నట్లుగా అనిపిస్తుంది. రెండున్నరేళ్ళుగా జీవితంలో ఏదో వెలితిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక నుండి అలా ఉండదు. ఎందుకంటే త్వరలోనే నా జీవితంలో ఓ కీలక ఘట్టం జరగబోతుంది. మా నాన్న పఠాన్, అమ్మ హిందూ, రెండో అమ్మ కేథలిక్. వదిన పంజాబీ. మరి నాకు కాబోయే భార్య మాత్రం విదేశం నుండి వస్తుందనుకొంటున్నా. నేను కులమతాలకు ప్రాదాన్యమివ్వను. మానవత్వానికే ప్రాధాన్యమిస్తాను" అని అన్నారు.

సల్మాన్ మాటలను గమనిస్తే... త్వరలోనే లులియాను పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. మరి ఈ అమ్మడినైనా పెళ్లి చేసుకుంటాడో లేక మళ్ళీ ఇంకో అమ్మాయి కోసం ఎదురుచుస్తాడో త్వరలోనే తెలియనుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.