English | Telugu

కార్తికేయ 'బెదురులంక' జూన్ లో విడుదల

కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'బెదురులంక 2012'. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్న ఈ చిత్రంతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాని జూన్ లో విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

టీజర్, ఇతర ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్ర కథ, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం, కార్తికేయ-నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ, కెమెరా వర్క్, గోదావరి అందాలు, ఆద్యంతం నవ్వించే కామెడీ ఇలా ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు ఎన్నో టీజర్ లో ఇదివరకే చూపించేసారు.

చిత్ర విడుదల తేదీ ప్రకటన సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. "చిత్రం పై పూర్తి నమ్మకంతో భారీస్థాయిలో విడుదల చేస్తున్నాము. ఇప్పటివరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా ఉంటుంది. గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే 'బెదురులంక 2012' ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది" అన్నారు.

ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి తదితరులు నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్స్ గా సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, ఎడిటర్ గా విప్లవ్, ప్రొడక్షన్ డిజైన్ గా సుధీర్ మాచర్ల వ్యవహరిస్తున్నారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.