English | Telugu

అఖండ 2 కి పోటీగా వస్తున్నావా... నిలబడగలరా!


-అఖండ 2 కి పోటీగా రష్మిక
-అందరిలో ఆసక్తి
-బాలయ్య జాతర ప్రారంభం


పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)ద్వారా బాలయ్య(Balakrishna)'శివతాండవం' చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఉద్విగ్తతత తో ఎదురుచూస్తున్నారు. ప్రచార చిత్రాల ద్వారా రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం, పోటీగా ఇతర బడా హీరోల సినిమాలు లేకపోవడంతో బాలయ్య ఈ సారి అఖండ 2 ద్వారా ఎలాంటి రికార్డులు సృష్టించబోతున్నాడనే ఆసక్తి కూడా నెలకొని ఉంది. మరి ఇలాంటి టైం లో రష్మిక మందన్న(Rashmika Mandanna)ప్రీవియస్ మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్'(The GirlFriend)ఓటిటి వేదికగా అడుగుపెడుతుండటం ఆసక్తిని కలుగచేస్తుంది.


రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చింది. అఖండ 2 రిలీజ్ రోజైన డిసెంబర్ 5 నే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా వ్యాప్తంగా ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. ఈ మేరకు గర్ల్ ఫ్రెండ్ హక్కులని పొందిన నెట్ ఫ్లిక్స్(Netflix)సంస్థ అధికారంగా ప్రకటించడంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ గా మారడమే కాదు ఈ విషయంపై సినీ లవర్స్, సినీ పండితులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'అఖండ 2 పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. దీంతో పాన్ ఇండియా ప్రేక్షకులు అఖండ 2 ఆడుతున్న థియేటర్స్ కి క్యూ కట్టడం ఖాయం. పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉండటంతో శివజాతర ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో గర్ల్ ఫ్రెండ్ ఓటిటి వేదికగా ఏ మేర ఆదరణని అందుకుంటుందో అని వారంతా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.


also read: నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా


మరి ఈ నేపథ్యంలో గర్ల్ ఫ్రెండ్ సాధించే వ్యూస్ పై ఆసక్తి నెలకొని ఉంది. నవంబర్ 7 న పాన్ ఇండియా వ్యాప్తంగా థియేటర్స్ లో అడుగుపెట్టిన గర్ల్ ఫ్రెండ్ ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే అందుకుంది. ఈ విషయాన్నీ ఈ చిత్రం ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ల లెక్కలు చెప్తున్నాయి. రష్మిక యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు.


'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.