English | Telugu

స్పిరిట్ ఓటిటి డీల్ పై ఆసక్తికర వార్త.. నిజమేనంటారా!

షూటింగ్ ప్రారంభం కాకముందే ఏంటి ఇదంతా
అసలు ఆ న్యూస్ నిజమేనా!
ప్రభాస్, సందీప్ రెడ్డి క్రేజ్ స్థాయి ఇదేనా!


కొన్ని కాంబినేషన్స్ పై అంచనాలు ఏర్పడటం సహజం. ఆ తాలూకు అంచనాలని పలు రకాలుగా ఉదహరిస్తు కూడా చెప్పుకోవచ్చు. కానీ కొన్ని కాంబినేషన్స్ మాత్రం ఆ అంచనాల స్థాయిని మించి తెరకెక్కుతాయి. అలాంటి ఒక కాంబినేషన్ ప్రభాస్(Prabhas),సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga).పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద ఈ ఇద్దరి కటౌట్స్ కి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఆ ఇద్దరి 'స్పిరిట్' అధికారకంగా ప్రారంభమైనప్పట్నుంచి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో స్పిరిట్ అప్ డేట్ గురించి తెలుసుకోవడం తమ రోజువారి దినచర్యలో భాగమైంది. రీసెంట్ గా స్పిరిట్ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.


ప్రముఖ ఓటిటి సంస్థ స్పిరిట్ డిజిటల్ హక్కులని 160 కోట్ల రూపాయిల భారీ మొత్తాన్ని చెల్లించి పొందినట్టుగా సోషల్ మీడియా లేటెస్ట్ టాక్ .టాలీవుడ్ సర్కిల్స్‌లో కూడా సదరు టాక్ బాగానే వినిపిస్తుంది.ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గాని ఈ మధ్య కాలంలో షూటింగ్ ప్రారంభం కాకముందే అంత భారీ ధరకి కొనుగోలు చెయ్యడం అంటే రికార్డు అని చెప్పుకోవచ్చు. అగ్ర హీరోల సినిమా ఓటిటి హక్కులు పొందే విషయంలో ఓటిటి సంస్థల మధ్య పోటీ వాతావరణం ఉంటుంది. అందుకే చాలా సంస్థలు సినిమా ప్రారంభ దశలోనే భారీ మొత్తంలో చెల్లించి స్ట్రీమింగ్ హక్కులని పొందుతాయి. పైగా ప్రభాస్, సందీప్ రెడ్డి ఇద్దరు పాన్ ఇండియా స్థాయిలో ఒక బెంచ్ మార్కుని సృష్టించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అంత భారీ మొత్తంలో చెల్లించి ఓటిటి హక్కులు పొందారనే మాట సినీ పరిశీలకులు కూడా వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్, సందీప్ రెడ్డి ఫ్యాన్స్ మాత్రం సదరు న్యూస్ పై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

also read:అఖండ 2 కి పోటీగా వస్తున్నావా... నిలబడగలరా!


స్పిరిట్ వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. సందీప్ రెడ్డి ఇప్పటికే స్పిరిట్ గురించి చెప్తున్న పలు విషయాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా ఇంతరకు భారతీయ చిత్ర పరిశ్రమలో తెరకెక్కని ఒక వైవిధమైన సబ్జెట్ తో తెరకెక్కబోతుంది. యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి(Tripti Dimri)హీరోయిన్. పాన్ ఇండియా యాక్టర్స్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం