English | Telugu

థామ టీజర్.. రష్మిక లో అతీంద్రియ శక్తులు! 

స్టార్ హీరోయిన్ 'రష్మిక'(Rashmika Mandanna)పుష్ప పార్ట్ 1 , పార్ట్ 2 ,యానిమల్, చావా, సికందర్, కుబేర వంటి సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు సంపాదించింది. కొన్ని సంవత్సరాలుగా రష్మిక సాధించిన విజయాలు పాన్ ఇండియా స్థాయిలో మరో హీరోయిన్ కి లేవన్నా అతిశయోక్తి కాదు. అంతలా వరుస విజయాలతో దూసుకుపోతు చాలా బిజీగా ఉంది.

రష్మిక అప్ కమింగ్ చిత్రాల్లో 'థామ'(Thama)అనే హిందీ చిత్రం ఒకటి. హర్రర్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో 'ఆయుష్మాన్ ఖురానా'(ayushmann khurrana)కి జోడిగా చేస్తుంది. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి, టీజర్ రిలీజ్ అయ్యింది. వరల్డ్ ఆఫ్ 'థామ' పేరుతో నిమిషం ముప్పైఎనిమిది సెకన్ల నిడివి ఉన్న టీజర్ చూస్తుంటే అతీంద్రియ శక్తులతో కూడిన రొమాంటిక్ జోనర్ లో 'థామ' తెరకెక్కినట్టుగా అర్ధమవుతుంది. రష్మిక క్యారక్టర్ చూస్తుంటే దుష్ట శక్తులపై పోరాటం చేసే యువతిగా, ప్రేమని పంచే యువతిగా, రెండు భిన్నమైన క్యారెక్టర్స్ ని పోషించినట్టు అర్ధమవుతుంది. దీంతో రష్మిక డ్యూయల్ రోల్ లో కనిపిస్తుందేమో అనే క్యూరియాసిటీతో పాటు, కథ ఏమై ఉంటుందనే ఆసక్తి కూడా కలుగుతుంది. ఆయుష్మాన్ క్యారక్టర్ తో పాటు డైలాగ్స్ ఇంట్రస్ట్ గా ఉన్నాయి. విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా కూడా 'థామ' ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతుందని అర్ధమవుతుంది. సీనియర్ నటుడు పరేష్ రావెల్, నవాజుద్దీన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

చావా, స్త్రీ 2 ,తెహ్రాన్, భూల్ ఛుక్ మాఫ్, బేధీయా, లవ్ ఆజ్ కల్ వంటి విభిన్న చిత్రాలని తెరకెక్కించిన మ్యాడ్‌డాక్‌ ఫిలింస్‌ ప్రైవేట్ లిమిటెడ్ పై దినేష్ విజన్(Dinesh Vijan)నిర్మిస్తుండగా, 'ఆదిత్య సర్పోత్దార్'(Aditya Sarpotdar)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. విభిన్న చిత్రాలని తెరకెక్కించిన ఆదిత్య గత ఏడాది జూన్ లో అంతా కొత్త వారితో తెరకెక్కించిన 'ముంజ్యా' అనే కామెడి హార్రర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకోగా 132 కోట్లు వసూలు చేసింది. దీంతో 'థామ'పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. దీపావళి కానుకగా థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం