English | Telugu

పదేళ్ళ తర్వాత ఎన్టీఆర్ ఖాతాలో ఫ్లాప్..!

'టెంపర్'కి ముందు ఎన్టీఆర్ వేరు.. 'టెంపర్' తర్వాత ఎన్టీఆర్ వేరు. 2015లో వచ్చిన 'టెంపర్' మొదలుకొని, 2024లో వచ్చిన 'దేవర' వరకు.. ఏడు సినిమాలు చేశాడు ఎన్టీఆర్. అందులో ఒక్క పరాజయం కూడా లేదు. ఇటీవల కాలంలో ఇలా వరుసగా ఏడు విజయాలు అందుకున్న స్టార్స్ ఎవరూ లేరనే చెప్పాలి. అంతటి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ కి ఇప్పుడు 'వార్-2' రూపంలో ఊహించని షాక్ తగిలింది.

ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ ఫిల్మ్ 'వార్-2'. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆగస్టు 14న విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ మొదటి వీకెండ్ లో దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. అయితే ఎన్టీఆర్-హృతిక్ కాంబోకి, ఆ బడ్జెట్ కి ఈ కలెక్షన్స్ తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 'వార్-2' ఆశించిన స్థాయిలో పర్ఫార్మ్ చేయట్లేదు.

'వార్-2' తెలుగు థియేట్రికల్ రైట్స్ ని నిర్మాత నాగవంశీ దాదాపు రూ.80 కోట్లకు దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.80 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ, ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే.. రూ.50 కోట్ల లోపు షేర్ కే పరిమితమవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే భారీ నష్టాలు తప్పవు. మరి 'వార్-2' తెలుగునాట అనూహ్యంగా పుంజుకొని హిట్ అనిపించుకుంటుందో లేక పదేళ్ల తర్వాత ఎన్టీఆర్ ఖాతాలో ఫ్లాప్ పడేలా చేస్తుందో చూడాలి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం