English | Telugu

మిల్కీ అందాలు బయటకొచ్చాయి

మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆగడు'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. అక్కడ మహేష్ బాబు, తమన్నాలపై పాటల చిత్రీకరణ జరుగుతున్న టైంలో తీసిన ఫోటోలు కొన్ని బయటకు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలలో తమన్నా అందాలు చూసిన నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. స్విట్జర్లాండ్‌లో పచ్చటి కొండల మధ్య అందగా ముస్తాభై అజంతా శిల్పంలా వుందట తమన్నా. తన అందాలు అందరినీ బోర్ కొట్టించాయనుకుందో.. ఏమో కానీ..? ఈ సినిమాలో కాస్త డోస్ పెంచినట్టే కనిపిస్తోంది. ఈ ఫోటోలలోనే ఇంత అందంగా కనిపిస్తే, సినిమాలో ఏ రేంజ్ లో అందాలు ఆరబోసిందో?

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.