English | Telugu

ఇది కదా బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సింది!

జూన్ 10న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పుట్టినరోజు. స్టార్స్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమాల అప్డేట్లు రావడం సహజం. బాలయ్య పుట్టినరోజు కానుకగా అభిమానులకు ముందుగానే సర్ ప్రైజ్ లు వచ్చాయి. అఖండ-2 టీజర్ అప్డేట్ తో పాటు, కొత్త సినిమా ప్రకటన వచ్చింది.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'అఖండ-2'. అసలే బాలయ్య-బోయపాటి కాంబో, దానికితోడు అఖండ సీక్వెల్ కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ మూవీ టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు. రేపు(జూన్ 9) సాయంత్రం 6:03 కి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. (Akhanda 2 Teaser)

ఇక బాలయ్య నెక్స్ట్ మూవీ ప్రకటన కూడా వచ్చింది. 'వీరసింహారెడ్డి' వంటి సూపర్ హిట్ తర్వాత బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి చేతులు కలిపారు. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. చారిత్రక నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. (NBK 111)

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.