English | Telugu

వయలెంట్ డైరెక్టర్ తో బాలయ్య.. కాప్ స్టోరీతో పూనకాలే..!

మలయాళ చిత్రాలలో మోస్ట్ వయలెంట్ ఫిల్మ్ గా 'మార్కో' పేరు పొందింది. ఉన్ని ముకుందన్ హీరోగా హనీఫ్ అదేని దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. గతేడాది డిసెంబర్ లో విడుదలై, వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఈ చిత్రంతో వయలెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హనీఫ్ తో దిల్ రాజు ప్రొడక్షన్స్ ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ లో నందమూరి బాలకృష్ణ నటించే అవకాశముందని తెలుస్తోంది.

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ-2' చేస్తున్నారు. నెక్స్ట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి, బాబీ కొల్లి వంటి దర్శకులతో సినిమాలు చేసే అవకాశముంది. ఈ క్రమంలో ఇప్పుడు అనూహ్యంగా 'మార్కో' డైరెక్టర్ హనీఫ్ పేరు తెరపైకి వచ్చింది.

హనీఫ్ తో దిల్ రాజు ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసిన మూవీలో బాలయ్య నటించబోతున్నారట. ఇదొక కాప్ యాక్షన్ డ్రామా అని, ఇందులో బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం.

బాలయ్య యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. అందునా పోలీస్ యూనిఫామ్ వేస్తే మరింత విజృంభిస్తారు. అలాంటిది ఇప్పుడు ఆయనకు వయలెంట్ డైరెక్టర్ హనీఫ్ తోడవ్వడంతో.. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందనే ఆసక్తి కలుగుతోంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.