English | Telugu
నిధి.. ఆ ఫీట్ రిపీట్ అయ్యేనా?
Updated : Jul 14, 2021
తెలుగునాట తన తొలి, మలి చిత్రాలు `సవ్యసాచి` (2018), `మిస్టర్ మజ్ను` (2019) నిరాశపరిచినా.. మూడో సినిమా `ఇస్మార్ట్ శంకర్` (2019)తో సెన్సేషనల్ హిట్ అందుకుంది స్టన్నింగ్ బ్యూటీ నిధి అగర్వాల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జంటగా `హరిహర వీరమల్లు`లోనూ, సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ కి జోడీగా `హీరో`లోనూ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తోంది. వీటిలో `హీరో` ఈ ఏడాదిలోనే సిల్వర్ స్క్రీన్ పైకి రానుండగా.. `హరిహర వీరమల్లు` వచ్చే సంవత్సరం వేసవిలో వినోదాలు పంచనుంది.
ఇదిలా ఉంటే.. కోలీవుడ్ లోనూ ఈ `ఇస్మార్ట్` బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంటోంది. రీసెంట్ గా `జయం` రవికి జోడీగా `భూమి`లో, శింబు సరసన `ఈశ్వరన్`లో సందడి చేసిన నిధి.. త్వరలో ఉదయనిధి స్టాలిన్ కి జతగా ఓ తమిళ సినిమాలో కనిపించనుంది. `రెడ్` మాతృక `తడమ్`కి దర్శకత్వం వహించిన మగిల్ తిరుమేని ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. అంతేకాదు.. ఉదయనిధి హోమ్ బేనర్ `రెడ్ గెయింట్ మూవీస్` పతాకంపై ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.
మరి.. తెలుగునాట మూడో చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న నిధి.. తమిళంలోనూ అదే ఫీట్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.