English | Telugu

స‌న్నీలియోన్‌కి ఎంతిచ్చారు...?

క‌రెంట్ తీగ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టేసింది స‌న్నీలియోన్‌. స‌న్నీ ఎంట్రీకీ, ఆమె తెర‌కెక్కించిన పాట‌కీ.. మాస్ జ‌నాల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చేసింది. దాంతో చిత్ర‌బృందం చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించిన‌ట్టైంది. ఈ సినిమా కోసం స‌న్నీ కేవ‌లం 5 రోజులు మాత్ర‌మే కాల్షీట్లు కేటాయించింది. ఐదు రోజుల కోసం ఎంత తీసుకొందో తెలుసా...?? రూ.75 ల‌క్ష‌లు. వామ్మో.. రోజుకి పాతిక ల‌క్ష‌ల‌న్న‌మాట‌. స‌న్నీ ఇచ్చిన 5 రోజుల్ని చిత్ర‌బృందం బాగానే ఉప‌యోగించుకొంది. ఆమెపై ఐదారు సీన్లు, ఓ హాట్ పాట‌ని తెర‌కెక్కించ‌గ‌లిగారు. అంతేకాదు... సన్నీతో వీడియో ఇంట‌ర్వ్యూలు చేయించి, మీడియాకు అందించారు. ఈ 5 రోజులూ స‌న్నీలియోన్ అందించిన కోప‌రేష‌న్ అదిరిపోయింద‌ని చిత్ర‌బృంద‌మే చెబుతోంది. రూ.75 ల‌క్ష‌లు గిట్టుబాటు అయ్యే సూచ‌న‌లూ క‌నిపిస్తున్నాయి. ఎందుంకంటే స‌న్నీ ఎంట్రీకి థియేట‌ర్లో వ‌స్తున్న రెస్పాన్స్ అలా ఉందిమ‌రి. ఈ సినిమాతో తెలుగు నిర్మాత‌లు స‌న్నీ నామ జ‌పం చేయ‌డం ఖాయం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.