English | Telugu

చిరంజీవి చిన్నల్లుడు మరో వివాహం చేసుకున్నాడా?

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ మరో వివాహం చేసుకున్నాడా అనే సందేహం వస్తుంది చిరంజీవి చిన్న కూతురు శ్రియకు మొదటగా శిరీష్ భరద్వాజతో వివాహమైంది. వారిద్దరు ప్రేమ పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు. ఆ తరువాత శిరీష్ భరద్వాజతో శ్రీ‌జ‌కు అభిప్రాయ భేదాలు వ‌చ్చాయి. దాంతో శిరీష్ భరద్వాజ్ నుంచి ఆమె విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఆమె క‌ళ్యాణ్ దేవ్ అనే వ్యాపార‌వేత్త‌ను వివాహం చేసుకోంది. వీరి సంసారం కొంతకాలం బాగానే జరిగింది. అయితే గత ఏడాది కాలంగా డిస్టెన్స్ మెయిన్టెన్ చేస్తున్నారు. వీరికి అభిప్రాయ భేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. శ్రీజ తన తండ్రి చిరంజీవి వద్దనే ఉంటుంది. కళ్యాణ్ దేవ్ కూడా తన పేరెంట్స్ తో కలిసి ఉంటున్నాడు. అయినప్పటికీ వీరిద్దరూ విడిపోయినట్టు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ విడిపోయారు అనేది అందరికీ అర్థమవుతుంది.

ఇటీవల వీరిద్దరూ వాలెంటైన్స్ డే సందర్భంగా ఒకరినొకరు దెప్పి పొడుచుకుంటూ పోస్టులు చేశారు. ఒక మనిషిని ఇష్టపడడం కంటే అతన్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామన్నది ముఖ్యమని కళ్యాణ్ దేవ్ కామెంట్ చేశాడు. దాని కౌంటర్‌గా శ్రీజ ఒకరిని ప్రేమించడం అంటే వాళ్లని వాళ్లు అధికంగా ప్రేమించుకునేలా చేయాలి. మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమించేలా చేసుకోవడం కాదు. ప్రేమను గుర్తించాలి.... అని కామెంట్ చేసింది దీంతో కళ్యాణ్ దేవ్ శ్రీ‌జ విడిపోయార‌ని అర్ధ‌మైంది..ఆయ‌న త్వ‌ర‌లో మ‌రో వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు హల్చల్ చేశాయి.

సడన్‌గా కళ్యాణ్ దేవ్ పెళ్లి వేడుకల్లో కనిపించాడు. దాన్ని చూసి అందరూ కళ్యాణ్ దేవ్ రెండో వివాహం చేసుకున్నాడని భావించారు. కానీ తీరా చూస్తే అది తన ఫ్రెండ్ మ్యారేజ్ అని తెలిసింది. సదరు వివాహానికి కళ్యాణ్ దేవ్ మిత్రులతో కలిసి హాజరై ఎంజాయ్ చేశాడు. మ్యారేజి లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు కళ్యాణ్ దేవ్ సినీ పరిశ్రమకు కూడా దూరంగా ఉంటున్నాడు. ఆయన నటించిన మొదటి చిత్రం విజేత ఫర్వాలేదనిపించింది. తర్వాత సూపర్ మచ్చి చిత్రంలో నటించారు. 2022 సంక్రాంతి కానుకగా విడుదల అయింది. ఆశించ ఫలితం ఇవ్వలేదు. మూడో సినిమా కిన్నెరసాని నేరుగా ఓటీటీలో విడుదల అయింది ఆయన కొత్తగా సినిమాలకు సైన్ చేసిన దాఖలాలు లేవు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.