English | Telugu

కష్టాల బారిన శ్రీ లీల 

ఒక పాత సినిమాలో మహా నటుడు రావు గోపాల రావు ఒక డైలాగ్ ని చెప్తాడు. ఒక్కొక్కొళ్ళకి ఒక్కో సీజన్ నడుస్తుందనే డైలాగ్ ని చెప్తాడు. ఆయన చెప్పినట్టు ఇప్పుడు సేమ్ శ్రీ లీల సీజన్ నడుస్తుంది. విడుదల కి సిద్ధం గా ఉండే ఏ తెలుగు సినిమా లో చూసినా, షూటింగ్ జరుపుకుంటున్న ఏ కొత్త సినిమాలో చూసినా శ్రీ లీలే హీరోయిన్. ఊపిరి సడపలేనంత బిజీ గా శ్రీ లీల వర్క్ చేస్తుంది. అంత బిజీ లో కూడా అమ్మడు ఈ మధ్య తన అభిమానుల కోసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ లో శ్రీ లీల చెప్పిన విషయాలకి ఆమె అభిమానులు షాక్ అయ్యారు.

ఏ ముహుర్తమున నయా పెళ్లి సందడి మూవీ ద్వారా శ్రీ లీల పరిచయమయ్యిందో గాని ఆ సినిమా ఫలితం తో సంబంధం లేకుండా శ్రీ లీల జాతకమే మారిపోయింది. ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోయి ఎంతో మంది హీరోయిన్లకి అవకాశాలు లేకుండా చేస్తుంది. ఒక పక్కన కొత్త సినిమాల విడుదల కి సిద్ధం చేస్తూనే ఇంకో పక్క కొత్త సినిమా ల షూటింగ్ లో బిజీ గా ఉంది. మొన్ననే రామ్ పోతినేని తో
వచ్చిన స్కంద మూవీ తో ప్రేక్షకులని కనువిందు చేసిన శ్రీ లీల ఇప్పుడు వరుసగా రెండు మూడు వారాల గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 19 న బాలయ్యతో చేసిన భగవంత్ కేసరి,నవంబర్ లో మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ తో చేసిన ఆదికేశవ, డిసెంబర్ లో నితిన్ తో చేసిన ఎక్సట్రా ఆర్డినరీ మెన్ అనే సినిమాలు విడుదల కాబోతున్నాయి

ఇక ఆ తర్వాత తన కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసిన గుంటూరు కారం 2024 సంక్రాంతికి రాబోతుంటే ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సమ్మర్ కానుకాగా రాబోతుంది. ఇలా రిలీజ్ అయ్యే సినిమాలే కాకుండా ఇంకొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే విడుదల కాబోయే కొత్త సినిమా ప్రమోషన్స్ లో కూడా శ్రీ లీల పాల్గొంటూ ఫుల్ బిజీ గా ఉంది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మీరు మీ సినిమా ల విషయం లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని అడిగితే ఎంజాయ్ కాదండి బాబు ఒళ్ళు మొత్తం హూనమయిపోతుంది.నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా.. ఒక పక్క షూటింగ్ ,ఇంకో పక్కన ప్రమోషన్స్ ఇంకో పక్క డబ్బింగ్ ఇలా ఎన్నో బాధలు పడుతున్నాను అని అంది. ఆ తర్వాత మళ్ళి తనే ఒకప్పటి పాతతరం నటులు కష్టం తో పోల్చుకుంటే నా కష్టం చాలా తక్కువ అని అంది. ఎంతైనా తెలివిగల హీరోయిన్ కదా..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.