English | Telugu

వీకెండ్ స్పెషల్: అలనాటి తారలు మహానటి సావిత్రి

నటులెందరో....కానీ మహానటులు కొందరే. ముఖ్యంగా తారల్లో మహానటి అనగానే మదిలో ఠక్కున మెరుస్తుంది సావిత్రి. చక్కని అభినయం- చూడచక్కని రూపం ఆమెసొంతం. నేత్రాభినయంతో జనస్రవంతిని మంత్రముగ్ధులను చేసిన అభినేత్రి ఆమె. అయితే రీల్ లైఫ్ లో ఆమె మురిపించిన పాత్రలన్నీ రియల్ లైఫ్ ముందు దిగదుడుపే. మిస్సమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సావిత్రి.....తారాజువ్వలా తారామండలానికి ఎగసి.... మితిమీరిన బోళాతనంతో తోకచుక్కలా రాలి శల్యావశిష్టమైన శరీరంతో జీవన రంగస్థలి నుంచి నిష్క్రమించింది. అంతులేని అభిమాన ధనాన్ని, లెక్కలేనంత మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆ తారామణి జీవిత చరమాంకం అత్యంత విషాదకరం. ఇంతకీ ఆమె కథేంటి? ఎక్కడ మొదలైంది.....ఎలా ముగిసింది. మధ్యలో ఏం జరిగింది?

కనీసం యాభై ఏళ్లైనా జీవించలేదు...అయితేనేం చిరస్థాయిగా నిలిచే కీర్తి నార్జించింది సావిత్రి. ఆమె సెట్లో ఉందంటే ఎస్వీ రంగారావు లాంటి నటుడు కూడా నటనలో చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకొనేవారట. సాటి నటీమణులకు సైతం సావిత్రి అంటే గౌరవం, అభిమానం. మహానటిని తలుచుకుంటే చాలు నటన అదే వస్తుందంటారు. అలా వెండితెర సామ్రాజ్జానికి మకుటం లేని మహరాణిగా నిలిచిన సావిత్రి స్వస్థలం గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం చిర్రావూరు. 1936 జనవరి 4 న గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు రెండో సంతానంగా సావిత్రి జన్మించింది . ఆరునెలల వయసప్పుడే తండ్రి చనిపోయాడు. విజయవాడ కస్తూరిబాయి మెమోరియల్ స్కూల్లో చదివింది. శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి దగ్గర సంగీతం, శాస్త్రీయ నృత్యం నేర్చుకుని చిన్నప్పుడే ప్రదర్శనలిచ్చింది. ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో కొంతకాలం పనిచేసింది. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో సంసారం సినిమాతో 1956లో మొదటిసారిగా ముఖానికి రంగేసుకుంది. పాతాళభైరవిలోనూ చిన్న పాత్ర పోషించిన సావిత్రి కెరీర్ ని మలుపు తిప్పింది మాత్రం పెళ్ళిచేసిచూడు. అంత వరకూ చిన్నచిన్న పాత్రలకే పరిమితమైన సావిత్రి....తనలో ఉన్న ప్రతిభను దేవదాసులో ప్రదర్శించి విమర్శకుల ప్రశసంలందుకుంది. 1953లో వచ్చిన ఈ సినిమా అన్ని భారతీయ భాషల్లో విడుదలైనా ఇసుమంతైనా ఆదరణ తగ్గలేదు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వానికి, అక్కినేని, సావిత్రి నటనకు, ఘంటసాల గానానికి ఈ సినిమా చరిత్రలో మచ్చుతునకగా నిలిచి పోయింది. భగ్న ప్రేమికులకు "దేవదాసు" అనే పదం తెలుగు సాహిత్యంలో భాగమైపోయింది.

దేవదాసు తర్వాత ఓ ఏడు సినిమాల్లో నటించినా....మళ్లీ భారీ హిట్టిచ్చిన సినిమా మిస్సమ్మ. 1955లో అగ్రకథానాయకులంతా నటించిన పూర్తి స్థాయి హాస్యచిత్రమిది. ఈ సినిమాతో సావిత్రికి చక్కని అభినేత్రిగా మంచి పేరొచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా నిలదొక్కుకుంది. ఆ తర్వాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని పదిలపరచాయి. 1957 లో వచ్చిన తెలుగు చిత్ర చరిత్ర లోనే అజరామరం అనదగిన 'మాయాబజార్' లో ఆమె అసమాన నటనా వైదుష్యం సావిత్రి కీర్తి పతాకంలో ఒక మణిమకుటం. అది మొదలు ఎన్నో వైవిధ్య పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసింది.

కొన్ని సన్నివేశాల్లో సావిత్రి నటన చూస్తే ఆ సినిమాలో హీరో ఎవరో మరచిపోయి....సినిమాకు ఆయువుపట్టు సావిత్రేనా అని అనిపించకమానదు. నటుడిగా పుట్టి నటుడిగానే గిట్టిన ఎవర్ గ్రీన్ హీరో నాగేశ్వరావుతో కలసి సావిత్రి ఎన్నో సినిమాల్లో నటించింది. వాటిలో మూగమనసులు గురించి మాట్లాడుకుంటే....ఎంత చెప్పినా తక్కువే. పెద్దింటి అమ్మాయిగా సావిత్రి, పడవ నడిపే అబ్బాయిగా నాగేశ్వరావు నటన ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. అటు ఎన్టీఆర్ తో నటించిన సినిమాలన్నీ సినీ ప్రియుల అభిమానాన్ని చూరగొన్నవే. దేవత, గుండమ్మకథ, గుడిగంటలు, కలసి ఉంటే కలదు సుఖం..ఈ సినిమాల్లో ఆమె నటన వర్ణించేందుకు మాటలు చాలవు. అయితే ఎన్టీఆర్ ప్రియురాలిగా ఒదిగిపోయిన సావిత్రి ఎవ్వరూ ఊహించని విధంగా రక్తసంబంధం లో చెల్లెలిగా నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది.

ఒక్క నటనకే అంకితం కాకుండా తనలో కళాభిరుచిని చాటిచెప్పేందుకు చిరంజీవి, చిన్నారిపాపలు, మాతృదేవత, వింత సంసారం సినిమాలకు దర్శకత్వం వహించిందామె. వీటిలో చిన్నారి పాపలు చిత్రం దక్షిణ భారత దేశంలో తొలిసారి పూర్తిగా మహిళలే నిర్మించిన చిత్రంగా ప్రత్యేకత సంతరించుకోవడం విశేషం. కేవలం తెలుగుకే పరిమితమవకుండా...అటు తమిళంలోనూ అభిమానుల్ని సంపాదించుకుంది. ఇలా రెండున్నర దశాబ్దాల పాటూ తెలుగు, తమిళ చిత్రరంగంలో మకుటం లేని మహరాణిలా వెలిగిన సావిత్రి జీవితంలో భయంకరమైన మలువు పెళ్లి.

అప్పటికే రెండు పెళ్లిళ్లై.... చాలామంది తారలతో సంబంధం ఉన్న జెమినీ గణేషన్ ను పిచ్చిగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పుడు మొదలైన పతనం అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. తనను తాను కోల్పోతోంది అనే నిజాన్ని ఆలస్యంగా తెలుసుకుంది. మేల్కొనేసరికే కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. అంతా జరిగిపోయింది. ప్రేమ పిచ్చిది అనేమాట ఆమెకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే రెండుపదులైనా దాటని ప్రాయంలో సన్నిహితుల హెచ్చరికలు ప్రేమ ముందు ఓఢిపోయాయి. రహస్యంగా మైసూర్ చాముండేశ్వరీదేవి ఆలయంలో మూడుముళ్లు వేయించుకుంది. ఆ పెళ్లే ఒక్కసారిగా జీవితాన్ని మార్చేసింది.

సావిత్రి కెరీర్ అద్భుతంగా ఉన్నప్పుడు జెమినీ గణేషన్ ఆమెవెంటే ఉన్నాడు. తాను తాగుతూ సరదాగా సావిత్రిని తాగమని అడిగాడు. అంతకుముందు వరకూ మందు ముట్టని సావిత్రి తర్వాత జెమినీ గణేశన్ పుణ్యమా అని మందులేకుండా బతకలేని స్థితికి వచ్చేసింది. అటు సినిమా అవకాశాలు తగ్గడంతో ఆదాయమూ తగ్గింది. అంతగా చదువుకోని సావిత్రికి లావాదేవీల నిర్వహణ తెలియకపోవడంతో ఆమె ఆస్తిపై పెత్తనం సంపాదించాడు జెమినీ గణేషన్. అలాంటి సమయంలో తెలుగులో ఘన విజయాన్నందుకున్న మూగమనసులని తమిళంలో నిర్మించాలనుకుంది. హీరోగా భర్తనే ఎంపికచేసింది. కానీ జెమినీ గణేషన్ నో అన్నాడు. అప్పటికి కానీ డబ్బు తన చేతిలో లేదన్న వాస్తవం తెలియలేదు. అయినా పట్టుదలతో పూర్తిచేసింది...కానీ తమిళప్రేక్షకుల ఆదరణ పొందలేకపోవడంతో పాటూ...అటు భర్త కోపానికి గురైంది. అప్పటి నుంచి జెమినీ గణేషన్ ఇంటికిరావడం మానేశాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త ఎడబాటుని తట్టుకోలేకపోయింది. పూర్తిగా తాగుడుకు బానిసైంది. రీల్ లైఫ్ లో అద్భుతంగా జీవించడం తెలిసిన వెండితెర సామ్రాజ్జికి రియల్ లైఫ్ లో నటించడం రాలేదు.

ఎన్టీఆర్, ఏన్నార్, రాజ్ కుమార్ లాంటి అగ్రస్థాయి హీరోలకన్నా ఎక్కువ పారితోషికం తీసుకున్న సావిత్రికి చివరి రోజుల్లో చేతిలో చిల్లిగవ్వ లేదు. తాగొద్దని దేవదాసుకి నీతి బోధన చేసిన ఈ సినీ పార్వతి అదే తాగుడులో మునిగితేలింది. తిండికి దూరమైంది. శరీరం, మనస్సు రెండూ పాడయ్యాయి. మరోవైపు షుగరు, బీపీ ఉన్నా... తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. మొదటి నుంచి మహారాణిలా బతికి...అదే స్థాయిలో దానాలు చేసిన సావిత్రి కాలం, పరిస్థితులు మారినా ఆ అలవాటు మార్చుకోలేదు. అడిగినవారి అడిగినంత అన్నట్టు సాయం చేసింది. వియ్యాలవారికి సావిత్రి ప్రవర్తన నచ్చలేదు. వారు విధిస్తున్న ఆంక్షలకు లోబడి బతకడం ఇష్టంలేక బంగ్లా వదిలిపెట్టి కేవలం 500రూపాయల అద్దెకు చెన్నపట్నంలో చిన్న ఇల్లు తీసుకుంది. ఆ ఇంట్లోనే కొడుకుతో కాలం వెళ్లదీసింది.

పులిమీద పుట్రలా అంతకుముందు సావిత్రి ఆదాయపన్ను సక్రమంగా చెల్లించకపోవడం...నోటీసులు పంపించినా పట్టించుకోపోవడంతో వడ్డీలు మీద వడ్డీలు లెక్కకట్ట ఆమె ఆస్తులు జప్తు చేస్తామన్నారు. దీంతో మత్తునుంచి తేరుకున్న సావిత్రి మళ్లీ నటించాలని నిర్ణయించుకుంది. రీ ఎంట్రీలో కూడా దర్శననిర్మాతల ఆదరాభిమానాన్ని దక్కించుకుంది. కానీ పీక్కుపోయిన ఆమె ముఖం చూసి ప్రేక్షకులకు కంటతడి ఆగలేదు. ఓ కన్నడ చిత్రం షూటింగ్ లో ఉండగా...తన ఆస్తులు జప్తు చేశారనే నోటీస్ అందుకున్న సావిత్రి చాలా రోజుల తర్వాత మళ్లీ మందుగ్లాసు పట్టుకుంది. తిండిధ్యాసే లేదు.... మైసూర్ నుంచి బెంగుళూరు మీదుగా మద్రాసు వెళ్లుతుండగా ఓ కుక్కపిల్లని కొనుక్కుని వెళదాం అంటూ కొడుకుతో చెబుతూ నిద్రలోకి జారుకుంది. తెల్లవారింది కానీ ఆ మాహానటి నిద్రలేవలేదు. నోటి నుంచి నురగవస్తోంది. వైద్యులను సంప్రదిస్తే...ఆమె డయాబెటిక్ కోమాలోకి వెళ్లిందన్నారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుని ఆహారం తినకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందని చెప్పారు. 1980 మే 11 నుంచి కోమాలో ఉన్న ఆమె ఎవ్వరినీ గుర్తుపట్టలేని పరిస్థితి. కేవలం దేవదాసులో కలయిదని నిజమిదని పాట విన్నప్పుడు కొంత చలనం ఉండేదని చెబుతారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.