English | Telugu

'కోబ‌లి' మొద‌లైంది



అత్తారింటికి దారేది త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్‌లు మ‌ళ్లీ ఎప్పుడు క‌లుస్తారు? వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో మ‌రో సినిమాఎప్పుడు?? ప‌వ‌న్ అభిమానులు ఈ స‌మాధానాల కోస‌మే ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్ద‌రూక‌ల‌సి 'కోబ‌లి' సినిమా ఒక‌టి చేస్తార‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. ఈ సినిమాకి ఇంకొంచెం టైమ్ ప‌డుతుంద‌ని త్రివిక్ర‌మ్ కూడా చెబుతున్నారు. అయితే కోబ‌లికి సంబంధించిన స్ర్కిప్టు ప‌నులు మొద‌లైపోయాయ‌ట‌. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ఓ ప‌క్క మెల్లిగా జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన క‌థ ఇది. అందుకోసం త్రివిక్ర‌మ్ రీసెర్చ్ వ‌ర్క్ కూడా మొద‌లెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇది ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రం అనుకొంటున్నా.. పూర్తి వాణిజ్య విలువ‌ల‌తో తెర‌కెక్కిస్తున్నార‌ట‌. మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్‌ల సినిమాపూర్త‌య్యాక కోబ‌లి సినిమాసెట్స్‌పైకి వెళ్లే చాన్సుంది.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.