English | Telugu

సౌత్ క్వీన్ కాజలే

మగధీరాలో అందాల యువరాణిగా తెలుగు ఆడియెన్స్ మనసులో నిండి పోయిన కాజల్ ఇప్పుడు ట్విట్టర్ లో కూడా సౌత్ క్వీన్ అయిపోయింది. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ కి వెళ్ళి అక్కడా చక్కటి హిట్స్ కొట్టేసిన ఈ పంచధార బొమ్మ సౌత్‌ హీరోయిన్లలో అందరి కన్నా ఎక్కువ మంది ఫాలోవర్స్ ని కలిగివుంది. ఆమెకు 10 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ వున్నారట. అందుకే సౌత్ లో ట్విట్టర్ క్వీన్ కిరీటం ఆమెకే దక్కుతుంది.


బాలీవుడ్‌ లో అమితాబ్‌ బచ్చన్‌ ఖాతాలో 12 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ వుండగా, ఆయన తర్వాత దీపికా పడుకొనే ట్విట్టర్‌ అకౌంట్‌ని ఎక్కువమంది ఫాలో అవుతున్నారు. సౌత్‌లో దాదాపు నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ అన్పించుకున్న కాజల్ అగర్వాల్, బాలీవుడ్‌లో నటించిన ‘సింగం’ పెద్ద హిట్‌ అయ్యింది. లక్కీ చార్మ్ అని పేరున్న కాజల్ అభిమానులను సంపాదించటంలోనూ సో లక్కీ అనే చెప్పాలి.
పది మిలియన్ అభిమానులున్న కాజల్ వారిని సంపాదించుకోవడంతో పాటు దానిని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమని, వారి అభిమానమే తనని ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టిందని అంటోంది కాజల్.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.