English | Telugu

పండగ చేస్కో అంటున్న బర్త్ డే బాయ్ రామ్

చిన్న వయసులోనే ఎనర్జిటిక్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ తన మొదటి సినిమా దేవదాస్ నుంచి మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. యంగ్ స్టార్ పుట్టిన రోజు మే 15. ఈ సారి రామ్ తన పుట్టున రోజుని చెన్నైలో జరుపుకుంటున్నాడు. ఎందుకూ అంటే... ఇప్పుడు రామ్ హ్యాట్రిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించబోతున్నాడు. నిర్మాత పరుచూరి ప్రసాద్ సమర్పణలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్ గా నిర్మిస్తున్న చిత్రం "పండగ చేస్కో". మే 17న ప్రారంభం కానున్న ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో జరుగుతున్నాయి. దర్శకుడు గోపీచంద్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్, రామ్ ఈ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నారు. రామ్ పుట్టినరోజు. సినిమా యూనిట్ అంతా చెన్నైలో నే ఉండటంతో ‘పండగ చేస్కో' యూనిట్ సభ్యుల మధ్యే రామ్ పుట్టినరోజు జరుపుకుంటున్నట్లు సమాచారం.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.