English | Telugu

అనీష్ కురువిల్లా దర్శకత్వంలో సిద్ధార్థ

అనీష్ కురువిల్లా దర్శకత్వంలో సిద్ధార్థ హీరోగా ఒక చిత్రంలో నటించనున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఎన్నో హిట్ సినిమాలు తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల సొంత సంస్థ ఎమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ కి ఎగ్జిక్యూటీవ్ నిర్మాతగా ఉండి, తను స్వయంగా వ్రాసి దర్శకత్వం వహించి "ఆవకాయ్ బిర్యాని" అనే సినిమా తీసిన వ్యక్తే ఈ అనీష్ కురువిల్లా. ఎప్పుడూ కొత్త దర్శకులను ప్రోత్సహించే హీరో సిద్ధార్థ మంచి కథ ఉంటే అనీష్ కురువిల్లా దర్శకత్వంలో నటిస్తానని అన్నారట.


ఈ అనీష్ కురువిల్లా త్వరలో సిద్ధార్థ హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, వేణు శ్రీరామ్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న "ఓ మై ఫ్రెండ్" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే అనీష్ కురువిల్లా దర్శకత్వంలోని చిత్రంలో సిద్ధార్థ హీరోగా నటిస్తారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.