English | Telugu

'షాపర్స్ స్టాప్' బ్రాండ్ అంబాసిడర్ గా శృతి హాసన్

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది శృతి హాసన్. సినిమాలలోనే కాదు బ్రాండింగ్ లో కూడా దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే, పలు కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న శృతి హాసన్ తాజాగా, దేశంలోని పాప్యులర్ ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిటైల్ డిపార్ట్‌మెంటల్ స్టోర్ 'షాపర్స్ స్టాప్' కు బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసింది. శృతి బ్రాండింగ్ కోసం షాపర్స్ స్టాప్ భారీ అమౌంట్ ని ఆఫర్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం శృతి హాసన్ బాలీవుడ్ అక్షయ్ కుమార్ సరసన గబ్బర్ సినిమాలో నటిస్తోంది. తెలుగులో మహేశ్ బాబు, కొరటాల శివ సినిమాలో హీరోయిన్ గా చేయనుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.