English | Telugu

సమంత, రాజ్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా!.. రాజ్ ఆస్థి విలువ ఎంత

-అభిమానులు హ్యాపీ
-రాజ్ ఎవరు
-ఆస్థి ఎంత
-ఏజ్ గ్యాప్ ఎంత!

ఎట్టకేలకు స్టార్ హీరోయిన్ 'సమంత'(Samantha)తన అభిమానుల కోరిక ప్రకారం మళ్ళీపెళ్లి పీటలెక్కింది. ఈ రోజు ప్రముఖ దర్శకుడు 'రాజ్ నిడమోరు'(Raj Nidamoru)ని తమిళనాడు కోయంబత్తూర్‌ లోని 'లింగ భైరవి'(Linga Bhairavi)ఆలయంలో హిందూ సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకుంది. పెళ్లికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు ఇద్దరి యాష్ ట్యాగ్స్ కూడా ట్రేండింగ్ లో నిలుస్తున్నాయి. దీంతో ఆ ఇద్దరికి సంబంధించిన పలు విషయాలపై అభిమానుల్లో చర్చ జరుగుతుంది.

సమంత 2022 వ సంవత్సరంలో 'యశోద' అనే మూవీ చేసింది. ఆ టైంలో సమంత మయోసైటిస్‌(Myositis)అనే అరుదైన వ్యాధికి గురయ్యింది. ఈ విషయాన్ని అభిమానులతో కూడా పంచుకొని సదరు వ్యాధి వల్ల ఎప్పటికప్పుడు నీరసపడిపోతున్నానంటూ తెలియచేసింది. అంతకు ముందు ఏడాది రాజ్ నిడమోరు దర్శకత్వంలో ఫ్యామిలీ మాన్ సీజన్ 2 లో సమంత చేసి ఉండటం, సమంత వ్యాధి గురించి కూడా రాజ్‌కి తెలియడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. నాగచైతన్య నుంచి సమంత విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది రాజ్‌ కూడా తన వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పాడు. అప్పట్నుంచి ఇద్దరు జర్నీ చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఇద్దరు చెన్నై పికిల్‌ బాల్‌ టీమ్‌కి కో ఓనర్స్ గా వ్యవహరిస్తు వస్తున్నారు.

also read:విజయ్ రాజకీయ భవిష్యత్తుపై కమల్ సంచలన వ్యాఖ్యలు.. కమల్ స్టైల్ అంటే ఇదే

వయసురీత్యా సమంత, రాజ్‌కీ మధ్య 12 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌. రాజ్‌ 1975లో పుట్టగా, సమంత 1987లో పుట్టింది. రాజ్‌ స్వగ్రామం తిరుపతి. అక్కడే ఉన్న శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుకున్నాడు. ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టి తన స్నేహితుడు డికే తో కలిసి సంయుక్తంగా 2003 లో ఫ్లేవర్స్ అనే ఇంగ్లీష్ సినిమాకి దర్శకత్వం వహించాడు. అప్పట్నుంచి రాజ్ అండ్ డికె పేరుతో సినిమాలు తెరకెక్కించుకుంటూ వస్తున్నాడు. హిందీలో ఎక్కువగా సినిమాలు చేసే రాజ్ తెలుగులో డి ఫర్ దోపిడీ, సినిమా బండి వంటి సినిమాలకి నిర్మాతగా వ్యవహరించాడు. రాజ్ ఆస్థి విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.


బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం