విజయ్ రాజకీయ భవిష్యత్తుపై కమల్ సంచలన వ్యాఖ్యలు.. కమల్ స్టైల్ అంటే ఇదే
on Dec 1, 2025

-కమల్, విజయ్ ల పరిస్థితి ఏంటి!
-అనుభవం గొప్పది
-సలహాలు ఇచ్చే స్థితిలో లేను
లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan),ఇళయదళపతి విజయ్(Vijay).ఈ ఇద్దరి హవా తమిళ సిల్వర్ స్క్రీన్ తో పాటు పాన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతూ వస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో అభిమానుల,ప్రేక్షకుల బలం కూడా అపారం. ప్రజలకి సేవ చెయ్యడానికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సొంతంగా పొలిటికల్ పార్టీలని స్థాపించి ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు.
రీసెంట్ గా విజయ్ రాజకీయ జీవితాన్ని ఉద్దేశించి కమల్ హాసన్ మాట్లాడుతు 'విజయ్ నాకు సోదరుడు లాంటి వ్యక్తి. రాజకీయ పరంగా విజయ్‌కి సలహా ఇచ్చేందుకు ఇది సరైన సమయం కాదు. విజయ్ కి సలహా ఇచ్చే స్థితిలో కూడా లేను. అనుభవం మన కన్నా గొప్ప గురువు. అది నేర్పే పాఠాలు ఎవరు నేర్పించలేరు. మనుషులకి పక్షపాతం ఉండొచ్చు గానీ అనుభవానికి ఉండదు అంటు మరో సారి తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు.
also read: వైభవంగా జరిగిన సమంత పెళ్లి.. వరుడు రాజ్ నిడమోరు
ఇరువురి రాజకీయ జీవితాన్ని ఒకసారి చూసుకుంటే కమల్ ప్రస్తుత అధికార పార్టీ ''డిఎంకె'(DMK)మద్దతుతో తన 'మక్కల్ నీది మయ్యం పార్టీ'(Makkal Needi Mayyam)నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమల్,'డిఎంకె' కి పొత్తు ఉండటం ఖాయం. విజయ్ తన 'తమిళగ వెట్రీ కజగం'(Tamilaga vettri Kazhagam)పార్టీ నుంచి ఒంటరిగా పోటీ చేయనున్నాడు. ఇప్పటికే డిఏంకె తన ప్రత్యర్థి అని బహిరంగంగానే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో విజయ్ పై కమల్ చేసిన కామెంట్స్ వైరల్ గా నిలిచాయి. సినిమాల పరంగా చూసుకుంటే విజయ్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న వరల్డ్ వైడ్ గా 'జననాయగన్' తో అడుగుపెట్టనున్నాడు. కమల్ మాత్రం హీరోగా ఎలాంటి సినిమాని అనౌన్స్ చెయ్యలేదు. నిర్మాతగా రజనీకాంత్ తో ఒక సినిమాని నిర్మిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



