English | Telugu

నాగచైతన్య ఏం చేస్తున్నాడు.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా 


-సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా
-అప్ డేట్ ఇవ్వాలని సూచన
-నెక్స్ట్ మూవీ ఏంటి!

కింగ్ 'నాగార్జున'(Nagarjuna)నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 'నాగచైతన్య'(Naga Chaitanya)తనకంటూ సినీ వినీలాకాశంలో ఒక బ్రాండ్ ని సృష్టించుకున్నాడు.మూస ధోరణి లో సినిమాలు చెయ్యకుండా అన్ని రకాల జోనర్స్ లో సినిమాలు చెయ్యడం నాగ చైతన్య స్పెషాలిటీ. అందుకే వారసత్వంగా వస్తున్న అక్కినేని అభిమానులే కాకుండా తనకంటూ సొంతంగా అభిమానులని సంపాదించుకున్నాడు.


ఈ ఏడాది 'తండేల్' తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకోగా, ప్రస్తుతం 'వృష కర్మ'(Vrusha Karma)అనే మూవీ చేస్తున్నాడు. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా 'విరూపాక్ష' తో సత్తా చాటిన కార్తీక్ దండు దర్శకుడు. దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో 'వృషకర్మ' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు అందుకు తగ్గట్టుగానే ఉండటంతో 'వృషకర్మ' రాక కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ వస్తున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా అభిమానులు స్పందిస్తు ప్రస్తుత రోజుల్లో మూవీకి మేకింగ్ నుంచే పబ్లిసిటీ ఎంతో అవసరం అవుతుంది.

also read:సమంత, రాజ్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా!.. రాజ్ ఆస్థి విలువ ఎంత

ఆ విధంగా చేయడం వలన ప్రేక్షకుల నోళ్ళల్లో సినిమా రన్ అవుతూ ఉంటుంది. దాంతో రిలీజ్ రోజున కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం ఉండటంతో సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి 'వృషకర్మ' అప్ డేట్ ఎప్పటికప్పుడు ఇస్తుండాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కోరుతున్నారు.సుకుమార్(Sukumar)రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంయుక్తంగా నిర్మిస్తుండగా వరుస హిట్స్ తో జోరుపై ఉన్న 'మీనాక్షి చౌదరి'(Meenakshi Chaudhary)హీరోయిన్ గా చేస్తుండం ప్రత్యేకతని సంతరించుకుంది. పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న ప్రతిభావింతమైన టెక్నీషియన్స్ వృష కర్మ ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికికృషి చేస్తున్నారు.



బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం