English | Telugu

'భాయ్‌జాన్' టైమ్ షూరూ

సల్మాన్‌ ఖాన్‌ సినిమాల్లో కథా విలువలు లేకుండా కేవలం కమర్షియల్‌ హంగులతోనే బాక్సాఫీస్‌ వద్ద కోట్లకి కోట్లు వచ్చి పడిపోతుంటాయి. అసలు సల్మాన్‌ చిత్రంలో కాస్త కథ కూడా వుండి, తన అభిమానుల్తో పాటు ఇతర వర్గాలని కూడా ఆకట్టుకోగలిగితే ఇక దానికి వసూళ్లు ఎలా వుంటాయంటూ ఎప్పటికప్పుడు సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నా, భాయ్‌ ఆ కామెంట్స్‌ పట్టించుకోలేదు. ఎప్పుడూ మసాలా సినిమాల వెంట పడే సల్మాన్‌ఖాన్‌ తన తాజా చిత్రం 'బజరంగి భాయ్‌జాన్‌'లో మాత్రం తన ఇమేజ్‌కి అతీతమైన పాత్ర చేశాడు.

అమాయకుడు, అతి మంచోడు అయిన ఆంజనేయుడి భక్తుడిగా కథకి తగ్గట్టు ఒదిగిపోయి, నటుడిగా మెప్పించాడు. కంట తడి కూడా పెట్టించాడు. సల్మాన్‌ ఖాన్‌ ఇంతలా నటించడం చూసి చాలా కాలం అవడంతో బాలీవుడ్‌ అంతా భాయ్‌కి సలామ్‌ కొడుతున్నారు. తనకి ఇష్టమైన రంజాన్‌ పండగ సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్రం ఈ టాక్‌తో ఖచ్చితంగా రెండు వందల కోట్లకి పైగా వసూళ్లు సాధిస్తుందని నమ్మకం కలిగించింది. అందుకు తగ్గట్టే ఈ చిత్రానికి మొదటి రోజు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. రానున్న రోజుల్లో బాక్సాఫీస్‌ దగ్గర భాయ్‌ ఎన్ని రికార్డులు బద్దలుకొడతాడో.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.