English | Telugu

బాహుబలి-3 సర్ ప్రైజ్.. రాజమౌళి కీలక ప్రకటన!

బాహుబలి-3 పై రాజమౌళి క్లారిటీ
రంగంలోకి కొత్త దర్శకుడు
120 కోట్ల బడ్జెట్ తో ప్రాజెక్ట్

బాహుబలి రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఒక సినిమాగా అక్టోబర్ 31న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి అండ్ టీమ్ 'బాహుబలి-3' అనౌన్స్ మెంట్ వీడియోతో సర్ ప్రైజ్ చేయబోతున్నారంటూ తెగ చర్చ జరుగుతోంది. తాజాగా దీనిపై రాజమౌళి కీలక ప్రకటన చేశారు. (Baahubali The Epic)

'బాహుబలి: ది ఎపిక్' విడుదల సందర్భంగా ప్రభాస్, రానాతో కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజమౌళి సందడి చేశారు. ఈ ఇంటర్వ్యూలో 'బాహుబలి-3' గురించి వస్తున్న వార్తలపై రాజమౌళి స్పందించారు. (SS Rajamouli)

"బాహుబలి: ది ఎపిక్ ఇంటర్వెల్ లో 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' టీజర్ ను ప్రదర్శించబోతున్నాం. అయితే ఇది 'బాహుబలి-3' అని, అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నామని కొందరు అనుకుంటున్నారు. కానీ, ఇది 'బాహుబలి-3' కాదు. ఇదొక యానిమేషన్ ఫిల్మ్. బాహుబలి ప్రపంచాన్ని, బాహుబలి పాత్రలను తీసుకొని ఇషాన్ శుక్లా అనే యానిమేషన్ డైరెక్టర్ తో.. 3D యానిమేషన్ లో శోభు గారు రూ.120 కోట్ల బడ్జెట్ తో దీనిని నిర్మిస్తున్నారు. ఆ ఐడియా నాకు చాలా నచ్చింది. రెండు మూడేళ్ళుగా ఈ ప్రాజెక్ట్ పై వారు వర్క్ చేస్తున్నారు." అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

Also Read: తమన్నా ఫ్యాన్స్ కి షాకిచ్చిన రాజమౌళి

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.