బాంబు పేల్చిన రాజమౌళి.. బాహుబలి ఫ్యాన్స్ కి బిగ్ షాక్!
on Oct 29, 2025

- తమన్నా ఫ్యాన్స్ కి షాకిచ్చిన రాజమౌళి
- బాహుబలి నుండి ఆ మూడు సాంగ్స్ తొలగింపు
- కాలకేయ ఎపిసోడ్ కూడా..?
బాహుబలి రెండు భాగాలను కలిపి ఒక సినిమాగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇందులో ఏవైనా కొత్త సీన్స్ జోడిస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, దర్శకుడు రాజమౌళి మాత్రం ఊహించని షాక్ ఇచ్చారు. (Baahubali The Epic)
'బాహుబలి: ది ఎపిక్' విడుదల సందర్భంగా ప్రభాస్, రానాతో కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజమౌళి సందడి చేశారు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలో ఏమేమి ఎపిసోడ్స్ ఎడిటింగ్ లో తొలగించారో రివీల్ చేశారు.
Also Read: రవితేజ పోలీస్ సెంటిమెంట్.. మాస్ జాతర పరిస్థితి ఏంటి..?
బాహుబలి రెండు భాగాలు కలిపి 5 గంటల 27 నిమిషాల నిడివి. దానిని ఇప్పుడు 'బాహుబలి: ది ఎపిక్' కోసం 3 గంటల 44 నిమిషాల నిడివికి కుదించారు. ఇది చాలా పెద్ద టాస్క్. కొత్త సన్నివేశాలు దేవుడెరుగు. ఉన్న సన్నివేశాలను, సాంగ్స్ ని కూడా తొలగించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే కొన్ని కీలక సీన్స్ ని, సాంగ్స్ ని ట్రిమ్ చేసినట్లు రాజమౌళి తెలిపారు.
మొదటి భాగంలో ఉన్న ప్రభాస్-తమన్నా మధ్య లవ్ సీన్స్ ని తొలగించినట్లు రాజమౌళి చెప్పారు. అలాగే 'పచ్చ బొట్టేసిన', 'ఇరుక్కుపో', 'కన్నా నిదురించరా' ఈ మూడు సాంగ్స్ ని రిమూవ్ చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు, కొన్ని యుద్ధ సన్నివేశాలను కూడా తొలగించినట్లు రాజమౌళి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కాలకేయ యాక్షన్ ఎపిసోడ్ ని కుదించినట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



