English | Telugu
రుద్రమదేవి 'రానా' ఫస్ట్ లుక్ పోస్టర్
Updated : Dec 13, 2014
రుద్రమదేవి చిత్రంలో దగ్గుబాటి రానా నిడదవోలు యువరాజు చాళుక్య వీరభద్రుడు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. రేపు ఆయన బర్త్ డే సందర్భంగా రానాకు సంబంధించిన స్టిల్ ను విడుదల చేసింది ఈ చిత్రబృందం. ఇందులో రానా ఒక చేతిలో కత్తి పట్టుకుని, అదిరిపోయే రీతిలో కనిపిస్తున్నాడు. అలాగే అతని బ్యాక్స్’గ్రౌండ్’లో చాళుక్య కాలం నాటికి సంబంధించి కట్టడంలాగే అద్భుతంగా అమర్చారు. ఇదివరకే అనుష్క, అల్లుఅర్జున్’ల ఫస్ట్’లుక్’లకు అభిమానుల నుంచి మంచి ప్రస్తావన రాగా.. రానాకు అలాగే రెస్పాన్స్ లభిస్తోంది. అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, సుమన్, కెథరిన్ వంటి భారీ సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.