English | Telugu

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

-సూపర్ గా చెప్పిన రోహిణి
-స్పీచ్ కి అందరు ఫిదా
-ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!


సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

రోహిణి మాట్లాడుతు ఈ సమాజం నాకు స్త్రీ అనే క్యారక్టర్ ని ఇచ్చింది. పెద్దయ్యాక వేరే వారి ఇంటికి వెళ్తాను కాబట్టి, వాళ్ల పేరు చెడిపోకూడదని నువ్వు ఇలా కూర్చోవాలి, పలానా వంటలు నేర్చుకోవాలని పెద్ద వాళ్ళు చెప్తారు.ప్రతి కుటుంబంలో అమ్మ నే ఈ విషయాలని చెప్తుంది. అదే అమ్మ కొడుకుతో కూడా మాట్లాడుతు 'పలానా పని నువ్వు చేయకూడదు. అమ్మాయే చెయ్యాలి అని చెప్తుంది. అలా కాకుండా ఇద్దరు కలిసి పని చేయాలని చెప్తే బాగుండు. సొసైటీ లో చాలా విషయాలని సరిచేసే శక్తి స్త్రీ కి ఉంది.అందుకే బాగా చదువుకోవాలి. అహోరాత్రులు ఇళ్లల్లో శ్రమించే జీతాలు లేని శ్రామికులు స్త్రీలు. అన్నం ఎవరు వండినా ఉడుకుతుంది కదా. అబ్బాయిలకి కూడా అన్ని నేర్పండి. బయట అభ్యుదయ బావాలు మాట్లాడుతున్న వాళ్ళు తమ ఇంట్లో వాళ్ల గురించి కూడా ఆలోచించాలి.

Also read:సాయి పల్లవి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వేసవికి ఫుల్ మీల్స్ గ్యారంటీ


బట్టలు ధరించి బయటకి వెళ్ళాలి నగ్నంగా వెళ్లకూడదని చెప్పి ఎలా అయితే అలవాటు చేసామో. మన సాంప్రదాయ అలవాట్లని మనమే మన పిల్లలకి నేర్పించాలి. ఇక్కడ అందరం చీరలు కట్టుకుంటున్నాం. లండన్ లో షార్ట్స్, స్కర్ట్స్ ధరిస్తారు. అది వాళ్ల అలవాటు. చీరలు మన అలవాటు.ఫ్రెండ్స్ ఆనందపడతాడని మాదకద్రవ్యాలు అలవాటు చేసుకోకూడదని కూడా రోహిణి చెప్పుకొచ్చింది. రోహిణి సినీ కెరీర్ విషయానికి వస్తే రీసెంట్ గా రష్మిక సోలో హీరోయిన్ గా వచ్చిన మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్ లో' ముఖ్యమైన క్యారక్టర్ ని పోషించింది. ప్రస్తుతం ఎలాంటి సినిమాలకి కమిట్ అవ్వలేదు.భారతీయ చిత్ర సీమకి సరికొత్త విలనిజాన్ని పరిచయం చేసిన లెజండ్రీ యాక్టర్ రఘువరన్ ఆమె భర్త అని తెలిసిందే. 1996 లో ఆ ఇద్దరి వివాహం జరగగా 2004 లో విడాకులు తీసుకున్నారు. ఆ ఇద్దరకీ ఒక కొడుకు.. పేరు రిషి.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం