English | Telugu

స్టూడియోలో దొంగ‌లు ప‌డ్డారు

సెల‌బ్రెటీల ఇళ్ల‌లో, స్టూడియోలో దొంగ‌లు ప‌డుతున్నారు. పూరి ఇంట్లో దొంగ‌లు బీభ‌త్సం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఇంట్లో దాదాపు రూ.15 ల‌క్ష‌ల విలువైన వ‌స్తువులు మాయం అయ్యాయి. ఇప్పుడు అలాంటిదే మ‌రో ఘ‌ట‌న‌. జూబ్లీహిల్స్‌లోని రామానాయుడు స్టూడియోలో దొంగ‌లు ప‌డ్డారు. విలువైన షూటింగ్ సామాగ్రి మాయ‌మైంది. దాని విలువ దాదాపు రూ.60 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని స‌మాచార‌మ్‌. వెంట‌నే విష‌యాన్ని జూబ్లిహిల్స్ పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు తీగ లాగితే డొంక క‌దిలింది. ఈ స్టూడియోలో ప‌ని చేస్తున్న న‌లుగురు వ‌ర్క‌ర్లు క‌ల‌సి... ప‌థ‌కం ప్ర‌కారం రోజూ కొన్ని వ‌స్తువులు మాయం చేస్తూ వ‌చ్చారు. చివ‌రికి దొరికి పోయారు. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.