English | Telugu

తాగి దొరికేసిన రాజ‌శేఖ‌ర్‌!

రాజ‌శేఖ‌ర్ అంటే.. యాంగ్రీ యంగ్ మెన్ అనుకొందురు... ఈయ‌న అమ్మ రాజ‌శేఖ‌ర్‌. డాన్సింగులు, డైరెక్షింగులూ చేస్తుంటాడు క‌దా.. ఆయ‌న‌. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అడ్డంగా బుక్క‌యిపోయాడు. ఈమ‌ధ్య సినీ సెల‌బ్రెటీల‌ను పోలీసులు వ‌ద‌ల‌ట్లేదు. పోనీలే పాపం అని వ‌దిలేయ‌డం లేదు. మొన్న‌టికి మొన్న‌ ర‌చ‌యిత మ‌చ్చ ర‌వి కూడా ఇలానే దొరికేశాడు. ఆ త‌ర‌వాత ఆయ‌న డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్ద‌యింది. ఇప్పుడు అమ్మ‌రాజ‌శేఖ‌ర్ వంతు వ‌చ్చింది. శుక్ర‌వారం రాత్రి త‌ప్ప‌తాగి.. కారు డ్రైవ్ చేసుకొంటూ జూబ్లీహిల్స్ ద‌గ్గ‌ర పోలీసుల‌కు దొరికిపోయాడు. ఆ స‌మ‌యంలో కార్లో రాజ‌శేఖ‌ర్ తో పాటు కుటుంబ స‌భ్యులున్నారు. పోలీసులు కారు సీజ్ చేశారు.. అమ్మ రాజ‌శేఖ‌ర్‌పై కేసు న‌మోదు చేశారు. అస‌లే ఆయ‌న కెరీర్ అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు ప‌రువూ పోయింది.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.