English | Telugu

రెట్రో ఓటిటి డేట్ ఇదేనా!  

సూర్య(Suriya)పూజాహెగ్డే(Pooja hegde)జతగా ఈ నెల 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ రెట్రో(Retro). తొంభైవ దశకానికి చెందిన కథనాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ రొమాంటిక్ మూవీ తెలుగు నాట పెద్దగా ప్రేక్షాదరణ పొందకపోయినా తమిళనాట మంచి విజయాన్నే అందుకుంది. 100 కోట్ల రూపాయిల వసూళ్ళని తమిళనాట అందుకోవడమే ఇందుకు నిదర్శనం.

ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటిటి హక్కులని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో సదరు సంస్థ ఈ మూవీని జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకువస్తుందనే టాక్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందనే వార్తలు వస్తున్నాయి.జూన్ 5 ఖాయమైతే కనుక అతి తక్కువ వ్యవధిలోనే ఓటిటిలోకి అడుగుపెట్టిన సూర్య మూవీ రెట్రోనే కావచ్చు.

కార్తీక్ సుబ్బరాజ్(Karthik SUbbaraj)దర్శకత్వంలో తెరకెక్కిన రెట్రో కి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించగా జాజు జార్జ్, జయరాం, నాజర్, ప్రకాష్ రాజ్, కరుణాకరన్, శ్వాసిక, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జ్యోతిక, సూర్య, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ సుమారు 60 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించడం జరిగింది.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.