English | Telugu

ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకోలేదు..ఇరవై నుంచి ముప్పై ట్యూన్స్ 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కెరీర్ లోనే ప్రెస్టేజియస్ట్ మూవీగా 'పెద్ది'(Peddi)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చరణ్ ఈ మూవీలోపలు రకాల ఆటల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తిగా చేస్తున్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది. మేకర్స్ ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్ లో చరణ్ క్రికెట్ ఆడినా కూడా చరణ్ చెప్పిన డైలాగ్స్ తో రక రకాల ఆటలు ఆడతాడని అనుకుంటున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్(Janhvi Kapoor)జత కడుతుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్(Sivarajkumar)కీలక పాత్ర పోషిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ మరియు వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా బుచ్చిబాబు(Buchibabu)దర్శకత్వం వహిస్తున్నాడు.

రీసెంట్ గా బుచ్చిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఉత్తరాంధ్ర నేపథ్యంలో పెద్ది తెరకెక్కుతుంది. ఈ సినిమాలో క్రికెట్ కేవలం బ్యాక్ డ్రాప్ మాత్రమే. ఎమోషన్ చాలా బలంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు క్రితమే ఈ కథని సిద్ధం చేసుకున్నాను. చరణ్ గారు ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతు లుక్ విషయంలో ఎన్నో జాగ్రతలు తీసుకుంటున్నారు. రెహ్మాన్ గారు సైతం ఒక్కో సాంగ్ కి 20 నుంచి 30 దాకా ట్యూన్స్ ఇస్తున్నారు.

చిన్నప్పట్నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. దీంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని ఎంతో ఆశగా ఉండేది. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తు లైఫ్ లో సెటిల్ అయితే చూడాలనేది వాళ్ళ కోరిక. అందుకే హైదరాబాద్ లో ఎంబిఏ కోసం చేరాను. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా క్లాస్ లు వినేవాడిని. ఆ తర్వాత నా అభిరుచిపై దృష్టి పెట్టి సుకుమార్ వద్ద 100 %లవ్, ఆర్య 2 , రంగస్థలం చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసానని చెప్పుకొచ్చాడు. బుచ్చిబాబు ఫస్ట్ మూవీ 'ఉప్పెన' అనే విషయం తెలిసిందే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.