English | Telugu

NC24: సుకుమార్ హ్యాండ్.. అక్కినేని ఫ్యాన్స్ కి పండగే!

ఈ ఏడాది 'తండేల్'తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అక్కినేని నాగ చైతన్య.. తన తదుపరి సినిమాని 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు. 'NC24' అనేది వర్కింగ్ టైటిల్. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఎస్.వి.సి.సి. బ్యానర్ లో మైథలాజికల్‌ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ గా రూపొందుతోన్న ఈ సినిమాపై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'NC24' నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ ఈ సినిమాపై అంచనాలను పెరిగేలా చేస్తోంది.

'NC24' కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ గుహ సెట్ వేశారు. ఈ సెట్ చూడటానికి ఎంత సహజంగా ఉందో, అంతే అద్భుతంగా ఉంది. ఈమధ్య ఈ తరహా సినిమాలన్నీ ఎక్కువగా గ్రాఫిక్స్ ని ఎక్కువగా నమ్ముకుంటున్నాయి. కానీ, 'NC24' టీం మాత్రం సహజత్వం కోసం ఇంత భారీ సెట్ ని ఏర్పాటు చేశామని చెబుతోంది. ఈ సెట్ లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమా చిత్రీకరణ 18 రోజుల పాటు జరగగా, 10 శాతానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.

'విరూపాక్ష' నిర్మాణంలో భాగమైనట్లుగానే.. 'NC24' నిర్మాణంలోనూ సుకుమార్ భాగమయ్యారు. స్క్రిప్ట్ పరంగా ఆయన పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని, 'విరూపాక్ష'ను మించిన మ్యాజిక్ చేయడం ఖాయమని చెబుతున్నారు.

ఇందులో చైతన్య ట్రెజర్ హంటర్ గా కనిపించనుండగా, దక్ష అనే ఆర్కియాలజిస్ట్ పాత్రలో మీనాక్షి కనిపించనుంది. 'NC24'లో హీరో పాత్రకి సమానంగా హీరోయిన్ పాత్ర ఉంటుందట. స్క్రీన్ టైం పరంగా చూస్తే హీరో కంటే మీనాక్షి పాత్ర కొద్ది నిమిషాలు ఎక్కువ కనిపిస్తుందని అంటున్నారు.

ఇప్పటిదాకా చైతన్య కెరీర్ లో తండేల్ అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కాగా, ఇప్పుడు అంతకుమించిన బడ్జెట్ తో 'NC24' తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమాపై నెలకొన్న అంచనాల నేపథ్యంలో అప్పుడే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ ఆఫర్స్ భారీగా వస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.